KKR vs DC, IPL 2021: ఢిల్లీ జోరుకు బ్రేకులు వేసిన కేకేఆర్ బౌలర్లు.. తక్కువ పరుగులకే కట్టడి.. కోల్‌కతా టార్గెట్ 128
KKR vs DC, IPL 2021: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
KKR vs DC, IPL 2021: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆటకు పూర్తి భిన్నంగా ఆడింది. దీనికి కారణం కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించారు.
ఓపెనర్ ధావన్ (24 పరుగులు, 20 బంతులు, 5 ఫోర్లు) ఊపుమీదున్నట్లు కనిపించినా.. 4.6 ఓవర్లో ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులో నిలిచేందుకు బ్యాట్స్‌మెన్లు అంతగా ఇంట్రస్ట్ చూపించనట్లు కనిపించారు. స్టీవ్ స్మిత్ 39(34 బంతులు, 4 ఫోర్లు), శ్రేయాస్ అయ్యర్ 1, హెట్ మెయిర్ 4, లలిత్ యాదవ్ 0, అక్షర్ పటేల్ 0 త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరిచారు.
ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ (39), అశ్విన్ (9) కొద్దిసేపు కేకేఆర్ బౌలర్లను గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. కానీ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ టీం నిర్ణీత ఓవర్లలో తక్కువ పరుగులు మాత్రమే చేసింది. అయితే విచిత్రమేమిటంటే ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా రాకపోవడం విశేషం.
కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో ఫెర్గ్యూసన్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
INNINGS BREAK!
Excellent performance with the ball from @KKRiders as they limit #DelhiCapitals to 127/9.
2⃣ wickets each for Sunil Narine, Venkatesh Iyer & Lockie Ferguson
3⃣9⃣ runs each for Rishabh Pant & Steve Smith. #VIVOIPL #KKRvDC
Scorecard? https://t.co/TVHaNszqnd pic.twitter.com/Y6EqPR468F
— IndianPremierLeague (@IPL) September 28, 2021
Also Read: IPL 2021: ఎట్టకేలకు ‘మిస్టరీ గర్ల్’ నవ్వింది.. హైదరాబాద్ జట్టుకు ధన్యవాదాలంటూ నెటిజన్ల ట్వీట్లు
Mumbai Indians Vs Punjab Kings: నిలవాలంటే గెలవాల్సిందే.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..? వీడియో