Andhra Pradesh: ఆ రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇవే..

మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆర్థిక వనరులను సమకూర్చుతూనే ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

Andhra Pradesh: ఆ రైతులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు ఇవే..
Ap Cm Ys Jagan

AP CM YS Jagan Mohan Reddy Review: మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఆర్థిక వనరులను సమకూర్చుతూనే ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో మహిళల్లో పాడిపశువుల పెంపకం ప్రోత్సహించామని తెలిపారు.

జగనన్న అమూల్‌ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళలకు మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. గత ప్రభుత్వం హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని ఆరోపించారు..అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు..రేట్ల పరంగా పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందిని చెప్పారు సీఎం జగన్.

అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ అన్నారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని.. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి ఆదేశించారు జగన్. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

మరోవైపు మత్య్స సంపదపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాదు, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే లక్ష్యమని తెలిపారు. స్థానిక వినియోగాన్ని పెంచడంద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకు వస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. దీంతో దళారీ వ్యవస్థ అంతమవుతుందన్నారు.

ప్రాసెసింగ్‌ చేసేవాళ్లు, ఎక్స్‌పోర్ట్‌ చేసేవాళ్లు సిండికేట్‌ అవుతున్నారని రైతుల సూచనల మేరకు ప్రీప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని పేర్కొన్నారు. అలాగే, ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలని తెలిపారు. రైతులను ఆదిశగా ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం, రైతుల్ని దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చామని అన్నారు. చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఆక్వా రంగానికి ఇచ్చే సబ్సిడీలు రైతులకు నేరుగా అందేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేయడానికి తగిన ఆలోచనలు చేయాలని అధికారులకు తెలిపారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్‌ కూడా పెట్టే ఆలోచన చేయాలని సూచించారు. ఫిష్‌ ఆంధ్రా లోగోను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. ఆక్వాహబ్‌లు, అనుబంధిత రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. జనవరి 26 నాటికి దాదాపు 75–80 హబ్‌లను, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయని, వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రి ప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.

ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనుల ప్రగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. నాలుగు ఫిషింగ్‌ హార్బర్లలో పనులు మొదలయ్యాని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలివిడతగా ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌–జులై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధం చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. మిగిలిన 5 ఫిషింగ్‌ హార్బర్ల పనులు ఈ డిసెంబర్‌లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.

Read Also….  Police Enthusiasm: పోలీసుల అత్యుత్సాహం.. పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ ప్రసవం కోసం వెళ్తున్న గర్భిణీ కారుపై ప్రతాపం

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu