AP Rains: బోరున వాన.. మహిళకు పురిటి నొప్పులు.. డోలిలో తీసుకెళ్లేందుకు యత్నం.. మధ్యలోనే ఆగిన ప్రయాణం

ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరంలోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.  ఎడతెరపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు..

AP Rains: బోరున వాన.. మహిళకు పురిటి నొప్పులు.. డోలిలో తీసుకెళ్లేందుకు యత్నం.. మధ్యలోనే ఆగిన ప్రయాణం
Doli
Follow us

|

Updated on: Sep 28, 2021 | 6:43 PM

ఏపీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరంలోని చాలా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది.  ఎడతెరపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. కొన్ని ఊళ్లు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. విజయనగరం జిల్లాలో ఓ హృదయం కలిచివేసే ఘటన జరిగింది. పాచిపెంట మండలం కేరంగిలో చోడిపల్లి బంగారమ్మకు పురిటినొప్పులు వచ్చాయి. వారి ఊరి చుట్టు వాగు ఉధృతంగా ప్రవాహిస్తోంది.

ధైర్యం చేసిన ఆమె కుటుంబ సభ్యులు వర్షంలోనే ఆమెను పూడి నుండి పనుకువలస వరకు ఐదు కిలోమీటర్ల మేర డోలిలో మోసుకెళ్లాడానికి సిద్ధమయ్యారు. మార్గమధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఆయినా వారు ముందుకు కదిలారు. రెండు గెడ్డలను దాటి బాలింత డోలిలో మోసుకెళ్లారు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో వారి డోలి ప్రయాణం ఆగింది. చేసేదిలేక మధ్యలోని నందెడు వలస వద్ద ఆగి అంగన్‎వాడి కార్యకర్త ఇంట్లో నాటువైద్యం చేశారు. ఈ వర్షాలతో మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీని మీదుగా రుతుపవన ద్రోణి, అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో ముసురుపట్టి ఉంది. చాలాచోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతపురత్రయం, కాకినాడ గ్రామీణంలో 18.7 సెం.మీ.చొప్పున, కాకినాడ నగరంలో 16.9 సెం.మీ.వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరంలోనూ ఆది, సోమవారాల్లో 14 సెం.మీ.కుపైగా వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. విశాఖపట్నం జిల్లా కల్యాణపులోవ ప్రధాన కాలువకు రావికమతం మండలం జడ్‌కొత్తపట్నం వద్ద గండిపడింది. గొలుగొండ మండలం కరక వద్ద చెరువుకు గండి పడింది. అనకాపల్లిలో మారేడుపూడి, రేబాకలోని కాలనీల్లోకి వరద చేరింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జీరికి వలస గ్రామంలో గుడిసెలను వరద నీరు ముంచెత్తింది.