AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin care Tips: వేసవిలో మోము చంద్రబింబంలా కనిపించాలంటే.. ముల్తానీ మట్టితో ఈ టిప్స్ ట్రై చేయండి..

వేసవిలో చర్మం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దుమ్ము, సూర్యకాంతి , కాలుష్యం కారణంగా, చర్మం క్షీణించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ముఖం నిస్తేజంగా కనిపించడం ప్రారంభమవుతుంది. వేసవిలో, మీరు ముల్తానీ మట్టితో కొన్ని వస్తువులను కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని అప్లై చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.

Skin care Tips: వేసవిలో మోము చంద్రబింబంలా కనిపించాలంటే.. ముల్తానీ మట్టితో ఈ టిప్స్ ట్రై చేయండి..
Summer Health Care Tips
Surya Kala
|

Updated on: May 02, 2025 | 7:39 PM

Share

వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే మార్కెట్లో లభించే చాలా ఉత్పత్తులలో రసాయనాలు ఉంటాయి. అవి తక్షణ మెరుపును ఇవ్వవచ్చు.. కానీ దీర్ఘకాలిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి. ఎక్కువ రసాయన ఉత్పత్తులను వాడటం వల్ల చర్మం మెరుపు తగ్గుతుంది. ఇతర చర్మ సమస్యలు పెరుగుతాయి. కనుక సహజ ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. ముల్తానీ మట్టి మన అమ్మమ్మల కాలం నుంచి వాడుకలో ఉంది. నేటికీ ప్రజలు ముల్తానీ మట్టిని వాడుతున్నారు. ఇది చర్మంలోని నూనెను నియంత్రించి ముఖంపై మెరుపు ఉండేలా చేస్తుంది.

ముల్తానీ మిట్టిలో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖం మీద పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి, అయితే ముల్తానీ మిట్టిలో కొన్నిటిని కలిపి అప్లై చేస్తే రెట్టింపు ప్రయోజనాలను పొందుతారు. కనుక ఈ రోజు ముల్తానీ మట్టితో వేటిని కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయాలి? ఎలా చేయాలి? ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

ముల్తానీ మట్టితో చర్మానికి మెరుపు

ముల్తానీ మట్టి క్లెన్సర్ .. ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీన్ని రోజూ వాడటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అదనపు నూనెను తగ్గిస్తుంది. చర్మం మీద మృతకణాలను తగ్గిస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది. చర్మం మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మట్టి బంగాళదుంప రసం

ముల్తానీ మట్టి, బంగాళాదుంప రసం చర్మానికి మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి బంగాళాదుంపను తురిమి రసం తీసి.. ఆ రసం లో ముల్తానీ మిట్టిని కలపండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి, 15-20 నిమిషాలు ఉండి ఆపై చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వలన చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా మారుతుంది.

ముల్తానీ మిట్టి టమోటా రసం

ముల్తానీ మట్టితో టమోటా రసం కలిపి అప్లై చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. టమాటో రసం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది, ముల్తానీ మిట్టి చర్మం నుంచి అదనపు నూనె, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మిశ్రమం టానింగ్‌ను కూడా తొలగిస్తుంది. ముఖంపై మెరుపు చెక్కుచెదరకుండా ఉంటుంది.

ముల్తానీ మట్టి నిమ్మరసం

ముల్తానీ మట్టి .. నిమ్మరసం చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేయడం వల్ల టానింగ్, మొటిమలు తొలగిపోతాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మం మెరుపును కాపాడుకునేందుకు ఈ వంటింటి చిట్కాలను పాటించాలి. ఇవి వేసవి కాలంలో టానింగ్, పొడిబారడం, మచ్చలు, మొటిమలు వంటి అన్ని చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి. ముఖం మచ్చ లేకుండా చంద్ర బింబంలా కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
'ఆ ఇద్దరి వల్లే ఓడిపోతున్నాం.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి ఔట్'
'ఆ ఇద్దరి వల్లే ఓడిపోతున్నాం.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి ఔట్'
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
శని నక్షత్ర సంచారం.. ఈ రాశి వారికి సమస్యలు తప్పవు!
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
అక్షయ తృతీయ వేళ భారీ ఊరట? బంగారం,వెండి ధరలపై కేంద్రం బిగ్‌డెసిషన్
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
ఉదయాన్నే ఒక్క గ్లాసు ఈ నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
పుచ్చకాయ గింజలను నమిలి తింటే ఏమవుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
3 నెలలుగా అద్దె కట్టని వ్యక్తి.. యజమాని వచ్చి చూసేసరికి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
వామ్మో.. గోళ్లు కొరికే అలవాటు ఎంత పనిచేసిందో చూడండి..
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మామిడి పండు తిని టెంక పడేస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నట్టే
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే