AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా.. మందులు అవసరం లేదు రోజూ ఖాళీ కడుపుతో ఈ పండు తిని చూడండి..

జీర్ణక్రియ, నిర్విషీకరణ, పోషక నిల్వతో సహా 500 కంటే ఎక్కువ శారీరక విధుల్లో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారం, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా కాలేయ సమస్యలు, ముఖ్యంగా కొవ్వు కాలేయ వ్యాధి పెరుగుతున్నాయి. కనుక సరైన చికిత్స కోసం ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించిన ప్రారంభ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.

Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారా.. మందులు అవసరం లేదు రోజూ ఖాళీ కడుపుతో ఈ పండు తిని చూడండి..
Prevent Fatty Liver Tips
Surya Kala
|

Updated on: May 02, 2025 | 4:44 PM

Share

ఫ్యాటీ లివర్ ఒకప్పుడు వృద్ధులలో ఎక్కువగా కనిపించేది. అయితే నేడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన పెరుగుతుంది. అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని సరళమైన, సహజమైన మార్గాలను ఎంచుకోవాలి. మందులపై ఆధారపడటానికి బదులుగా సరైన ఆహారం, జీవనశైలిని అవలంబించడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఆపిల్స్ తినడం వల్ల కాలేయ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఆపిల్స్ లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. కాలేయం కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఈ అలవాటును ప్రతిరోజూ అలవాటు చేసుకోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఫ్యాటీ లివర్ లక్షణాలను గుర్తించడం ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. మెడ నల్లబడటం, చర్మంపై చిన్న చిన్న మొటిమలు కనిపించడం వంటివి ఫ్యాటీ లివర్‌ లక్షణాలు. ఫ్యాటీ లివర్ తో ఉన్నవారు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అంతేకాదు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం .

ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఈ ఆహారానికి దూరంగా ఉండండి కొన్ని ఆహారాలు కొవ్వు పేరుకుపోయెలా చేసి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. వీటిలో వేయించిన, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌లు ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరును దెబ్బతీస్తాయి. అదనంగా ధూమపానం, మద్యపానం క్రమంగా కాలేయానికి హాని కలిగిస్తాయి. కనుక వీటిని తినడం పూర్తిగా తగ్గించండి.

ఇవి కూడా చదవండి

కాఫీ కాలేయానికి అనుకూలమైన పానీయం కాలేయ ఆరోగ్యానికి కాఫీ ఇస్తుందని.. అయితే కాఫీని మితంగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గుతుందని.. కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలో తేలింది.

క్రమం తప్పకుండా వ్యాయామం కీలకం కాలేయ ఆరోగ్యానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమ చాలా ముఖ్యం. చురుకైన నడక , యోగా లేదా తేలికపాటి శారీరక శ్రమల వంటివి రోజూ 30 నిమిషాలు చేయాలి. ఇలా చేయడం వలన కాలేయ పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. నిశ్చల జీవనశైలి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తుంది. కనుక చురుకుగా ఉండటం చాలా అవసరం.

రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను మిస్ చేయవద్దు అలసట , అజీర్ణం , పొత్తికడుపు ఉబ్బరం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే కాలేయ పరీక్ష కోసం వైద్యుడిని సంప్రదించాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)