AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paralysis Symptoms: పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకు ముఖ్య కారణం మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి. వీటి కారణంగా శరీరంలో అనేక మార్పులకు లోనవుతుంది. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళన తోడై అనేక సమస్యలు వస్తాయి. పక్ష వాతం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న సమస్యే..

Paralysis Symptoms: పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!
paralysis Symptoms
Chinni Enni
|

Updated on: Dec 22, 2024 | 4:57 PM

Share

ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు అనేవి బాగా ఎక్కువై పోయాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ అనేక వ్యాధులు వచ్చేస్తున్నాయి. చాలా మంది చిన్న పిల్లలు గుండె పోటుతో మరణిస్తున్న కేసులు ఎన్నో నమోదవుతున్నాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా చాలా మందికి పక్షవాతం వస్తోంది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, షుగర్, అధిక బరువు బాధ పడేవారికి ఎక్కువగా ఈ పక్షవాతం ఎటాక్ చేస్తుంది. ఈ పక్షవాతం వచ్చే ముందు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్‌గా తీసుకోకుండా.. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు. దీంతో ముందుగానే ఈ ప్రమాదం నుంచి బయట పడవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

స్పర్శ ఉండదు:

పక్ష వాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఈ స్పర్శ కూడా ఒకటి. ముఖానికి ఒక వైపు స్పర్శ అనేది ఉండదు. ఒక వైపును అస్సలు కదిలించలేరు. చర్మం అంతా సాగినట్లుగా ఉంటుంది. ముఖాన్ని ఒక వైపు కదిలించకపోతే పక్ష వాతం వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వెంటనే అప్రమత్తం అయి వైద్యుల్ని సంప్రదించండి.

కాళ్లు, చేతులు కదిలించలేరు:

ముఖంపైన కాకుండా శరీరంలో కూడా అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఒక వైపు కళ్లు చేతులను అస్సలు కదిలించలేరు. కాళ్లు, చేతులు వంకర్లు పోతూ ఉంటాయి. ఒక వైపు శరీర భాగం అందుకు అస్సలు సహకరించదు. ఇలా అనిపిస్తే ఆసల్యం చేయకండి.

ఇవి కూడా చదవండి

మాట సరిగ్గా రాదు:

పక్ష వాతం వచ్చే ముందు మాటలు కూడా సరిగ్గా రావు. మాటలు అస్పష్టంగా నత్తి నత్తిగా వస్తాయి. అలాగే మూతి కూడా కొన్ని సార్లు వంకర పోతుంది. మాట్లాడే మాటలు కూడా అర్థం కావు. ఇతరులతో మాట్లాడేందుకు కూడా ఇష్ట పడరు. అయోమయానికి లోనవుతారు. కొందరికి చెప్పేది కూడా అర్థం కాదు. ఇలా అనిపించినట్లయితే వెంటనే చికిత్స చేయించుకోవాలి. అంతే కాకుండా కళ్లు తిరగడం, కంటి చూపు మందగించడం, శరీరంలో నలతగా ఉండం, సరిగ్గా నడవ లేకపోవడం, విపరీతంగా తలనొప్పి, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.