AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee Smoothie: ఒత్తిడిని తగ్గించే కాఫీ స్మూతీ.. ఇలా చిటికెలో చేసేయండి..

ఒత్తిడిని తగ్గించడంలో కాఫీ ఎంతో చక్కగా పని చేస్తుంది. కాఫీనే కాకుండా కాఫీ పౌడర్‌తో చేసే ఈ స్మూతీ తాగితే ఒత్తిడి క్షణాల్లో తగ్గిపోతుంది. మీ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతుంది. ఒత్తిడి నుంచి ఈజీగా రిలీఫ్ పొందవచ్చు. మరి ఈ కాఫీ స్మూతీ ఎలా తయారు చేస్తారు? ఈ కాఫీ స్మూత్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Coffee Smoothie: ఒత్తిడిని తగ్గించే కాఫీ స్మూతీ.. ఇలా చిటికెలో చేసేయండి..
Coffee Smooth
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 22, 2024 | 9:34 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మంది ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ఈజీగా దీన్ని తగ్గించుకుంటే.. మరి కొంత మంది మాత్రం డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోకపోతే.. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తగ్గించడంలో కాఫీ ఎంతో చక్కగా పని చేస్తుంది. కాఫీనే కాకుండా కాఫీ పౌడర్‌తో చేసే ఈ స్మూతీ తాగితే ఒత్తిడి క్షణాల్లో తగ్గిపోతుంది. మీ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతుంది. ఒత్తిడి నుంచి ఈజీగా రిలీఫ్ పొందవచ్చు. మరి ఈ కాఫీ స్మూతీ ఎలా తయారు చేస్తారు? ఈ కాఫీ స్మూత్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కాఫీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు:

ఓట్స్, కాఫీ పౌడర్, నానబెట్టిన ఖర్జూరం, నానబెట్టిన జీడిపప్పు, పీనట్ బటర్, చియా సీడ్స్, సన్నగా కట్ చేసిన బాదం పప్పు.

కాఫీ స్మూతీ తయారీ విధానం:

ఒక గ్లాస్ కాఫీ స్మూతీ తయారు చేయడానికి మూడు స్పూన్ల ఓట్స్ కావాలి. కాబట్టి ఒక బౌల్‌ తీసుకుని అందులో మూడు స్పూన్ల ఓట్స్ తీసుకుని గోరు వెచ్చటి నీళ్లు వేసి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టాలి. ఆ తర్వాత నీరు ఒంపేసి.. మిక్సీ లేదా బ్లండర్ సహాయంతో ఓట్స్‌ని మెత్తని క్రీమ్‌లా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ ఇన్సెటెంట్ కాఫీ పౌడర్ వేసి కలపాలి. ఇది కూడా అంతా కలిసేలా బ్లండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో నానబెట్టిన జీడిపప్పు, ఖర్జూరం, కొద్దిగా పీనట్ బటర్ కూడా వేసి అంతా కలిసేలా మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇందులో కొద్దిగా నానబెట్టిన చియా సీడ్స్, సన్నగా తరిగిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. బాదం కూడా నానబెట్టింది తీసుకోవాలి. ఇలా నేరుగా తాగేయవచ్చు. చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగవచ్చు. ఈ స్మూతీ తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన అంతా పోతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఈ స్మూతీ రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఈ స్మూతీని ట్రై చేయండి.

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే