AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic: మైక్రోప్లాస్టిక్‌ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?

మానవ శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్ ఎక్కువగా వెళ్తున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. నీరు, గాలి, ఆహారం ద్వారా మనకు తెలియకుండానే ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశిస్తే.. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.? శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Plastic: మైక్రోప్లాస్టిక్‌ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.?
Micro Plastic
Narender Vaitla
|

Updated on: Nov 03, 2024 | 5:48 PM

Share

ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో ప్లాస్టిక్‌ ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వినియోగం కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మనకు తెలియకుండానే శరీరంలోకి ప్లాస్టిక్ ప్రవేశిస్తుందని పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. మైక్రోప్లాస్ట్‌ కణాలు శరీరంలోకి వాటంతటే పరవేశిస్తున్నాయి. తీసుకునే ఆహారం, నీరు గాలి ద్వారా కూడా శరీరంలోకి ఈ ప్లాస్టిక్‌ ఎంటర్‌ అవుతున్న పరిశోధకులు గుర్తించారు.

5 మిల్లీమీటర్ల కంటే తక్కువ లేదా 1 నానోమీటర్ వంటి మైక్రోప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి చేరుతున్నాయి. మైక్రో ప్లాస్టిక్‌ ఊపిరిత్తుల్లో చేరుతుందని ఇది వరకు పలు అధ్యయనాల్లో తేలింది. అయితే గడిచిన 8 ఏళ్లలో మనిషి మెదడులో కూడా మైక్రోప్లాస్టిక్ చేరుతున్నట్లు తేలింది. శాస్త్రవేత్తల ప్రకారం, మానవ మెదడులో 0.5 శాతం మైక్రోప్లాస్టిక్ పేరుకుపోయింది. మానవ శరీరంలోకి చేరిన మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యంపై చాలా ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయి.

2024లో చనిపోయిన వ్యక్తి మెదడులో గుర్తించిన ప్లాస్టిక్‌, 8 ఏళ్ల క్రితం సేకరించిన శాంపిల్‌తో పోల్చితే 50 శాతం పెరగడం గమనార్హం. 45 లేదా 50 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న వ్యక్తుల మెదడు కణజాలంలో ప్లాస్టిక్ సాంద్రత గ్రాముకు 4800 మైక్రోగ్రాములు, అంటే బరువు ప్రకారం 0.5% ఉన్నట్లు పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ కారణంగా మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మెదడు కణాలపై ప్లాస్టిక్ కణాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే కిడ్నీలు, కాలేయాల్లో కంటే మెదడులో ప్లాస్టిక్ ముక్కలు ఎక్కువగా పేరుకుపోయినట్లు వెల్లడైంది. శరీరంలోకి మైక్రోప్లాస్టిక్‌ చేరడం వల్ల సెల్ డ్యామేజ్‌తో పాటు, ఇన్ఫ్లమేషన్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. వీటిలో ఉండే రసాయనాలు క్యాన్సర్, పునరుత్పత్తి సమస్యలతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి, పేగులను దెబ్బతీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
QR కోడ్ నిజమైనదా.. నకిలీదా? పేమెంట్‌ చేసే ముందు ఇలా చెక్‌ చేయండి!
QR కోడ్ నిజమైనదా.. నకిలీదా? పేమెంట్‌ చేసే ముందు ఇలా చెక్‌ చేయండి!
మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. రుచిగా… హెల్తీగా
మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. రుచిగా… హెల్తీగా
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!
అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు.. మేనేజర్ ఏమన్నారంటే?
అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు.. మేనేజర్ ఏమన్నారంటే?
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు,సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు,సిరీస్‌లివే
గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే..
గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే..
ఇరాన్ అతి ముఖ్యమైన సైనిక స్థావరం ధ్వంసంః ట్రంప్
ఇరాన్ అతి ముఖ్యమైన సైనిక స్థావరం ధ్వంసంః ట్రంప్
శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి?
శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి?
ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధం వద్దని నిరసనలు!
ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధం వద్దని నిరసనలు!
సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? ఈ నంబర్లకు కాల్ చేస్తే..
సిలిండర్‌ బుక్‌ చేసినా ఇంకా రాలేదా? ఈ నంబర్లకు కాల్ చేస్తే..