Interesting Facts: థైరాయిడ్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదా.. నిపుణులు ఏం చెబుతున్నారు?
నేటి కాలంలో అనేక రోగాలు చుట్టుడుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో అన్ని వ్యాధులూ సాధారణ రోగాలుగా మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి రోగం ఎటాక్ చేస్తుందో తెలియడం లేదు. అందులోనూ చాలా మంది బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఇందుకు ముఖ్య కారణం మారిన లైఫ్ స్టైల్ విధానం.. ఆహారపు అలవాట్లే అని నిపుణులు చెబుతున్నారు. పెద్దలతో పాటు యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ ఉన్న వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా..

నేటి కాలంలో అనేక రోగాలు చుట్టుడుతున్నాయి. ఇప్పుడున్న కాలంలో అన్ని వ్యాధులూ సాధారణ రోగాలుగా మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి రోగం ఎటాక్ చేస్తుందో తెలియడం లేదు. అందులోనూ చాలా మంది బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. ఇందుకు ముఖ్య కారణం మారిన లైఫ్ స్టైల్ విధానం.. ఆహారపు అలవాట్లే అని నిపుణులు చెబుతున్నారు. పెద్దలతో పాటు యువత కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ ఉన్న వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ అసలు తీసుకోకపోవడమే మంచిది. అయితే థైరాయిడ్ ఉన్నవాళ్లు అన్నం తినకూడదని చాలా మంది అంటూ ఉంటారు. మరి ఇందులో నిజమెంత? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమస్య మరింత తీవ్ర తరం అవుతుంది..
చాలా మంది అన్నాన్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో కార్బోహైడ్రేట్లు అనేవి ఉంటాయి. అన్నం తిన్న వెంటనే తక్షణమే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అంతే కాకుండా.. రోగ నిరోధక శక్తి కూడా బల పడుతుంది. కానీ అన్నాన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే మత్రం.. బరువు బాగా పెరిగి పోతారు. ఇలాగే థైరాయిడ్ ఉన్నవాళ్లు అన్నం తింటే.. ఈ సమస్య మరింత తీవ్ర తరం అవుతుంది. కారణం థైరాయిడ్ ఉన్నవాళ్లు అయితే బరువు పెరుగుతారు. లేదంటే బక్కపల్చగా తయారై పోతారు. అందుకే థైరాయిడ్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
థైరాయిడ్ ఉన్నవాళ్లు అన్నాన్ని ఎక్కువగా తినకూడదు..
ఎందుకంటే బియ్యంలో గ్లూటెన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. అందుకే థైరాయిడ్ పేషెంట్లు అన్నం తినకూడదని అంటారు. గ్లూటెన్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గ్లూటెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది శరీరంలో ప్రతి రోధకాలను తగ్గిస్తుంది. థైరాక్సిన్ హార్మోన్ సమస్యలను కూడా కలిగిస్తుంది. అన్నం తినడం వల్ల బరువు కూడా పెరిగి పోతారు. ఈ కారణం వల్ల కూడా థైరాయిడ్ రోగులు అన్నం ఎక్కువగా తినకూడదు. అన్నం తినడం వల్ల థైరాయిడ్‌లో మార్పులు వస్తాయని నిపుణులు సైతం చెబుతున్నారు. అంతే కాకుండా వైట్ రైస్‌ని ఎక్కువగా తీసుకుంటే టైప్ – 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే మూడు పూటలా అన్నానికి బదులుగా.. ఒక పూటనే తీసుకోమని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.




