Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shawarma: వేడివేడిగా షవర్మా తింటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Shawarma Side-Effects: షవర్మా తినొచ్చా వద్దా..? ఈ చర్చ ఇప్పుడు చాలా హాట్‌ హాట్‌ గా సాగుతోంది. మరోవైపు షవర్మా తిని ఆనారోగ్యం పాలైన ఘటనల్లో కొందరు మరణించడం... మరింత బెంబేలెత్తిస్తోంది. ఇంతకీ షవర్మా ఎప్పుడు తినాలి? ఎలాంటి సమయాల్లో తినకూడదు?

Shawarma: వేడివేడిగా షవర్మా తింటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Shawarma
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 29, 2022 | 3:51 PM

Shawarma Side-Effects: ఒకవైపు.. వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో వేడి వేడిగా షవర్మా తింటే ఎంత బావుంటుంది. అవును ఇదే ఆలోచన చాలా మంది షవర్మా ప్రియులు చేస్తారు. కానీ షవర్మా… ప్రాణాలు తీస్తుందా? న్యూ ట్రెండ్ ఫాస్ట్ ఫుడ్ గా మారిన షవర్మా తింటే భూమిపై నూకలు చెల్లినట్లేనా? కేరళలో డేంజర్ బెల్స్ మోగించి.. చెన్నై లో బ్యాన్ వరకు దారితీసిన ఈ విదేశీ ఫుడ్.. మనలన్నేం చేయబోతోంది?? ఇలాంటి చర్చ ఇప్పుడు చాలా హాట్‌ హాట్‌ గా సాగుతోంది. మరోవైపు షవర్మా తిని ఆనారోగ్యం పాలైన ఘటనల్లో కొందరు మరణించడం… మరింత బెంబేలెత్తిస్తోంది. ఇంతకీ షవర్మా ఎప్పుడు తినాలి? ఎలాంటి సమయాల్లో తినకూడదు?

కొద్దిరోజుల క్రితం.. షవర్మా.. కేరళలో 16 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. దీంతో తమిళనాడు అప్రమత్తమై ఒక ప్రాంతంలో ఏకంగా షవర్మా అమ్మకాలను నిషేధించింది. ఈ పరిస్థితుల మధ్య మన పక్క రాష్ట్రాలుగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ లల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో అత్యధికంగా షవర్మా అమ్మకాలు సాగుతున్న హైదరాబాద్ లో మరింత చర్చసాగుతోంది. ఇంతకీ కేరళ.. తమిళనాడుల్లో ఏంజరిగింది.?

కేరళలో ఈనెల 1న జరిగిన ఘటనే.. ఇప్పుడు ఈ భయాందోళలకు కారణమైంది. కేరళ కాసరగోడ్​ జిల్లాలో కలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సుమారు యాభైమంది ఈవిధంగా షవర్మా తిని ఆనారోగ్యం పాలయ్యారు. ఓ జ్యూస్​ షాప్​లో షవర్మా తిన్న తర్వాత వీరంతా అనారోగ్యానికి గురైనట్లు అధికారులు గుర్తించడంతో ఈ షాపు యజమానిపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సెగ తమిళనాడును తాకింది. భారతీయ వంటకాల్లో భాగంగా కాని షవర్మా తినకుండా ఉండాలని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. షవర్మాపై కీలక వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్. “షవర్మా.. భారతీయ వంటకం కాదు. అది పశ్చిమ దేశాల ఆహారం. అక్కడి వాతావరణ పరిస్థితులకు అది సరిపోతుంది. ఆయా దేశాల్లో ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్​ డిగ్రీలలోకి పడిపోతుంది. షవర్మాను బయట అలానే వదిలేసినా పాడవదు. కానీ ఇక్కడ అలా కాదు. మాంసాహారాన్ని సరిగా నిల్వ చేయకపోతే పాడైపోతుంది. వాటిని తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.” అని అంటున్నారు సుబ్రమణియన్.

తమిళనాడు … వెల్లూరు జిల్లాలోని గుడియాత్తం మున్సిపాలిటీ మరో అడుగు ముందుకేసింది. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ సమావేశపరిచి షవర్మాపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ‘షవర్మాను పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత ఇష్టంగా తింటారు. కానీ.. షవర్మా వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అందుకే గుడియాత్తం మున్సిపాలిటీ పరిధిలో షవర్మా అమ్మకాలను నిషేధిస్తున్నాం’ అని ప్రకటించింది. అనారోగ్యకరమైన మాంసాహార వంటకాలు విక్రయించే దుకాణాలనూ సీజ్ చేస్తామని… కేరళలో షవర్మా తిని విద్యార్థి చనిపోయిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నాం” అని గుడియాథం మేయర్ సౌందరరాజన్ వెల్లడించారు.

Shawarma

Shawarma

ఇలాంటి పరిస్థితులు మధ్య… తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? షవర్మా ఫుడ్స్ అమ్మకాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. అనేది చర్చిస్తే…

హైదరాబాద్ లో షవర్మా సెంటర్లు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలో 2వేల వరకూ సెంటర్లు ఉన్నాయి. ఇంకా పెరుగుతున్నాయి. అనేక సంస్థలు ప్రాంఛైజ్ పెట్టి మరీ నిర్వహణచేస్తున్నాయి. ఇంతకీ షవర్మా పేరు కొందరికి కొత్తైనా… చాలా మందికి పాత పదమే. షవర్మా పాశ్చాత్య దేశాల వంటకం అని అనుకుంటున్నా… అది పశ్చిమాసియాకు చెందిన ఆహారమే అంటున్నారు.

ఇంతకీ షవర్మా ప్రిపెరేషన్‌ ఎలా చేస్తారు. ఈ డిష్‌ కు ఇంత ప్రాధాన్యత ఎలా ఏర్పడింది. చాలా వరకూ ముందు వివిధ రకాల మీట్స్ ఈ షవర్మాతయారు చేసినా.. ఇప్పుడు ఎక్కువ శాతం చికెన్ తోనే తయారుచేస్తున్నారు. షవర్మా తయారీ.. దాని మిషనరీ ఇవన్నీ చాలా కొత్తగా కన్పిస్తాయి. దీని ప్రిపరేషన్ కూడా ఓ కొత్తదనమే.

సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లో అందులో హైదరాబాద్లో 8ఏళ్ల క్రితం ఈ ట్రెండ్ ప్రారంభమైంది. 5ఏళ్లుగా బాగా విస్త్రత స్థాయిలో వ్యాపారం సాగుతంది. ఎందుకంటే.. ఈ డిష్‌ ఒక స్పెషల్.. అందులో టెస్టీ టేస్టీ అంటున్నారు… నిర్వాహకులు. ఇప్పుడు హైదరాబాదే కాదు… రాష్ట్రంలో అనేక సెంటర్లలో అనేక సెంటర్లు వచ్చాయి. దీని ప్రిపెఏషన్‌ ఒకవెరైటీ. అయితే.. ఒక ప్రొటీన్ ఫుడ్ గా దీన్ని యువత ఎక్కువ మంది షవర్మాప్రియులుగా మారుతున్నారంటున్నారు అందుకే.. భవిష్యత్ లో మరిన్నిసెంటర్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు షవర్మా అవులెట్ నిర్వాహకుడు ప్రణీత్ . ఏడేళ్ల క్రితం చాలా తక్కువగా ఈ ఫుడ్ రుచిచూసే వారు.. కానీ ఇప్పుడు దీనికి డైలీ కస్టమర్లు పెరిగారు. బిర్యానీలాంటి నాన్ వెజ్ ఫుడ్ స్థాయిలో షవర్మాకు డిమాండ్ పెరిగిందంటున్నాడు మరో షవర్మా అమ్మకందారుడు షరీఫ్‌.

Shawarma

Shawarma

వేడివేడి ఆహారం.. అందులో ప్రొటీన్ అందులో వెరైటీ రుచి అందుకే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటున్నారు షవర్మా ప్రియులు. అయితే ఎక్కడ తింటున్నాం… ఎంత హైజెనిక్ ఉంది వంటి విషయాలను చూడాలంటున్నారు. ఎక్కువగా జిమ్ లకు వెళ్లే వాళ్లు … వన్ మీల్ గా డైట్ ఫాలో అయ్యేవాళ్లూ తామూ దీనినే ఆహారం గా ఎంచుకున్నామంటున్నారు. అయితే.. కొన్ని చోట్ల నిషేదించినంత మాత్రాన. ఇది మంచి ఫుడ్ కాకపోదని… ఎక్కడ మంచిగా ఉందో చూసి ఎంచుకోవాలంటున్నారు. అయితే.. కొన్ని రోడ్లపక్కన.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా సాగుతున్న అమ్మాకాల వద్ద జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు షవర్మా ప్రియులు.

మరి ఇలాంటి షవర్మా అనారోగ్యాన్ని ఎలా కలిగిస్తోంది. ఎలా ప్రాణాలు తీసేవరకూ వెళుతోంది? ఎక్కడ కలుషితమై విషంగా మారుతోంది? వేల సంఖ్యలో వాహననాలు దూసుకుపోయే ప్రాంతంలో షవర్మా సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో అన్ని ఇంగ్రియెన్స్ తో పాటు దుమ్ము ధూళి… పొగా… అన్నీ కలగలిసిపోతున్నాయి. ఇలాంటి సెంటర్లు మోస్ట్ డేంజర్ గా కన్పిస్తున్నాయి.

అవును… షవర్మా మంచి ఫుడ్. అయినా ఎక్కడ తింటున్నాం? అది ఏ పరిస్థితుల్లో ఉంది? ఎలాంటి చికెన్ ఉపయోగిస్తున్నారు? ఎలాంటి ఇంగ్రియెన్స్ వాడారు? అందులో వేసే మైనోజ్ వంటి పదార్థాలు ఎలా ఉన్నాయి వంటి వాటిని గమనించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే.. కలుషితమైన ఆహారాన్ని తీసుకుని అనారోగ్యం పాలుకావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

మాంసం తో తయారయ్యే… ఆహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలా నిల్వ ఉంచుతున్నారు? ఎలా తయారుచేస్తున్నారు అనేది ముఖ్యం. రోడ్ల పక్కన దుమ్మూధూళీ వంటి వాటి మధ్య మాంసాహారం ఇలా గంటల తరబడి ఉంచి అమ్మకాలు సాగిస్తే .. కచ్చితంగా కలుషితం అవుతుందని.. దీని ద్వారా ఈకోలీ, సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాల ద్వారా రోగాలే కాదు.. చివరికి ప్రాణాలు తీసే పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయని  గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ హెచ్చరించారు.

ఏ పదార్థమైనా విషంగా మారడానికి కీలకం..బ్యాక్టీరియా. షవర్మా లాంటి స్ట్రీట్ ఫుడ్స్ లో బ్యాక్టీరియా ఎక్కువ మార్పులు చెంది… అది ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు. షవర్మా అందంగా కనిపించడానికి కొన్ని చోట్ల ఉపయోగించే కెమికల్స్..రంగులు… అనేక రోగాలకు..కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో విషంగా మారకపోయినా… చర్మవ్యాధులు లాంటి వాటికి దారితీస్తుందని  డెర్మటాలజిస్టు డాక్టర్ విజయశ్రీ హెచ్చిరిస్తున్నారు.

తాము షవర్మా తింటున్నాం..ఏం కావడం లేదన్న ధీమా అందిరిలో వ్యక్తమవుతుంది. అయితే ఇలాంటి ఫుడ్ వల్ల కొందరికి వెంటనే ప్రభావాలు కన్పిస్తే మరికొందరికి దీర్షకాలిక సమస్యలు కచ్చితంగా ఏర్పడే ప్రమాదం ఉందని  వైద్య నిపుణులు వార్న్ చేస్తున్నారు. ఏదైనా.. షవర్మా ఫుడ్ కొత్త చిక్కులకు కొత్త చర్చకు కేంద్రంగా మారుతోంది.

(గణేష్‌. వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌)

మరిన్ని లైఫ్ స్టైల్ కథనాలు చదవండి..