Lotus Flower Benefits: తామర పువ్వుతో ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ బైబై చెప్పొచ్చు!
తామర పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. పల్లెటూర్లలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న నీటి కుంటల్లో కూడా ఈ తామర పువ్వులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పూజల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. తామర పువ్వులు, తామర గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య తామర గింజలను కూర్లకు, స్నాక్స్‌కి కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. వీటితో చేసిన..

తామర పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. పల్లెటూర్లలో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న నీటి కుంటల్లో కూడా ఈ తామర పువ్వులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పూజల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. తామర పువ్వులు, తామర గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య తామర గింజలను కూర్లకు, స్నాక్స్‌కి కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. వీటితో చేసిన వంటలు కూడా చాలా బావుంటున్నాయి. తామర గింజలతోనే కాకుండా తామర పువ్వులతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తామర పువ్వుల్లో కూడా మన ఆరోగ్యానికి పరయోజనం చేకూర్చే ఎన్నో రకాల సుగుణాలు దాగి ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తామర పువ్వుల్లో ఉండే గుణాలు:
తామర పువ్వులను ఆయుర్వేదంలో కూడా పలు ఔషధాలుగా ఉపయోగిస్తారు. ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, క్లోరిన్, పొటాషియం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు వంటివి ఉన్నాయి. తామర పువ్వులతో తయారు చేసిన టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ లోటస్ టీ ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.
లోటస్ టీ తయారీ విధానం:
మార్కెట్లో లభ్యమయ్యే టీలలో లోటస్ టీ కూడా ఒకటి. ఇప్పుడు ఆన్ లైన్‌లో కూడా లోటస్ టీ పౌడర్ లభ్యమవుతుంది. అయితే దీని ధర కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇంటి వద్ద దొరికే తామర పువ్వులతో ఈ టీ తయారు చేసుకోవచ్చు. తామర రేకులను ఎండలో ఎండబెట్టి పౌడర్‌లా తయారు చేసి నిల్వ చేసకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. అందులో నీటిని వేసి.. ఆ తర్వాత రెండు తామర పువ్వుల రెక్కలను కూడా వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన ఉంచాలి. కాసేపటి తర్వాత వడకట్టుకుని.. గోరువెచ్చగా తాగాలి. ఇలా నేరుగా తాగలేని వారు ఇందులో తేనె లేదా బెల్లం కూడా కలుపుకుని తాగవచ్చు.
ఈ లోటస్ టీ తాగడం వల్ల.. తల నొప్పి, ఒత్తిడి, జ్వరం, చికాకు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా మంచి పౌష్టికాహారం కూడా అందుతుంది. నిద్రలేమి సమస్యతో బాధ పడేవారు ప్రతి రోజూ ఈ టీ తాగితే మంచి రిలీఫ్ నెస్ పొందుతారు. డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ తాగడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి. అలాగే బాలింతలు, గర్భిణీలు కూడా ఈ టీ తాగితే చాలా మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








