Sandalwood Face Pack: ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చందనం ఫేస్ ప్యాక్స్!

అందంగా మెరిసిపోవాలని అనుకోని మహిళలు ఉండరు. ఇతరుల కంటే ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడుతూ ఉంటారు. ఇందు కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తారు. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్‌లో అందానికి మెరుగులు దిద్దుతారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో స్కిన్ పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోండి. కొద్ది నిమిషాలు ఎండలో బయటకు వెళ్లినా.. ముఖం మెరుపు తగ్గిపోవడం ఖాయం. అంతే కాకుండా ట్యాన్ కూడా బాగా పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎండలు బాగా..

Sandalwood Face Pack: ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చందనం ఫేస్ ప్యాక్స్!
Sandalwood Face Pack
Follow us

|

Updated on: Apr 17, 2024 | 9:59 AM

అందంగా మెరిసిపోవాలని అనుకోని మహిళలు ఉండరు. ఇతరుల కంటే ప్రత్యేకంగా కనిపించాలని తహతహలాడుతూ ఉంటారు. ఇందు కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తారు. వేలకు వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్‌లో అందానికి మెరుగులు దిద్దుతారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో స్కిన్ పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోండి. కొద్ది నిమిషాలు ఎండలో బయటకు వెళ్లినా.. ముఖం మెరుపు తగ్గిపోవడం ఖాయం. అంతే కాకుండా ట్యాన్ కూడా బాగా పడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎండలు బాగా విపరీతంగా దంచికొడుతున్నాయి. ఇలాంటి సమయంలో అందంగా కనిపించాలంటే కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఈ వేసవి వేడిని తట్టుకుని చర్మాన్ని మరింత కాంతి వంతంగా తయారు చేసుకునేందుకు చందనం బాగా సహాయ పడుతుంది. చందనంతో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే.. ఎండలో మీ చర్మానికి చల్లదనం లభిస్తుంది. మరి ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పాల – చందనం ఫేస్ ప్యాక్..

ఒక స్పూన్ చందనం తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి.. సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఓ 10 – 15 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ చర్మానికి మంచి పోషణ అంది.. ఎండ వల్ల ట్యాన్ అవ్వకుండా ఉంటారు.

రోజ్ వాటర్‌ – చందనం ఫేస్ ప్యాక్..

పాల వాసన నచ్చని వారు రోజ్‌ వాటర్‌తో కూడా కలిపి చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కొద్దిగా చందనం, పసుపు, రోజ్ వాటర్ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖం, మెడకు పట్టించి.. సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఓ 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖం రీ ఫ్రెష్‌గా ఉంటుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

నిమ్మ రసం – చందనం ఫేస్ ప్యాక్..

జిడ్డు చర్మం ఉన్నవారు నిమ్మరసంతో చందనం ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. కొద్దిగా గంధపు పొడిలో నిమ్మరసం కలిపి.. ముఖానికి, మెడకు పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. రంధ్రాలు బిగిసి.. జిడ్డు రాకుండా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
చిన్న ఏలకులు..మాటల్లో చెప్పలేనన్ని, రాయలేనన్ని లాభాలు..!
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
మహేష్ సాంగ్‌కు ఈ చిన్నారి ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి..
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ రెండూ ఒక గూటి పక్షులే: ప్రధాని మోదీ
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంతంటే.!
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
కేఎల్ రాహుల్‌తో సహా T20 ప్రపంచకప్‌లో చోటు దక్కని స్టార్ ప్లేయర్లు
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
కీరా దోసకాయ మాత్రమే కాదు.. తొక్కలతో కోరినంత ఆరోగ్యం..!
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
మీ కాలి వేళ్లు ఎలా ఉన్నాయి.? దీంతో మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు..
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి
'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ' కూతురిని కత్తితోపొడిచిన తల్లి
తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..
తారక్‌కు రామ్ ఏమవుతాడో తెలుసా..