Salt Coffee: మీరెప్పుడైనా సాల్ట్ కాఫీని తాగారా? మన పూర్వికుల నాటి ఈ కాఫీని ఎలా తయారు చేస్తారంటే..
టర్కీలో కాఫీ కొంత వింతగా ఉంటుంది. ఎందుకంటే ఇది అమావాస్య రాత్రిలా నల్లగా, చిక్కగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కాఫీని అక్కడి ప్రజలు అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే..
Could Salt Make Coffee Taste Better? ప్రపంచంలో అతి ఎక్కువగా తాగే పానియాలు టీ, కాఫీలేనని మీకు తెలుసా? వీటితో ఉన్న అనుబంధం ఈ నాటిదికాదు. ఇవి మెదడును ఉత్తేజ పరిచే పానియాలు మాత్రమేకాదు చల్లని సాయంత్రం పూట కప్పు వేడి వేడి కాఫీ తాగుతూ ప్రపంచాన్ని మైమరిపించే విలాస పానియం కూడా. స్నేహితులు కలిసినా, బంధువులు ఇంటికి వచ్చినా కమ్మటి టీ, కాఫీలు ఆత్మీయంగా అందించకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. టీ, కాఫీల పేరు వినగానే ఎప్పుడెప్పుడా అని మనసు తహతహలాడిపోతుంది. వీటి రుచి, వాసనలే అందుకు కారణం. ఇంతలా ఇవి మనల్ని కట్టిపడేస్తున్నాయి. ప్రపంచంలో వివిధ దేశాల్లో వీటిని తయారు చేసే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. అందుకే అన్నింటా వీటి రుచి ఒకేలా ఉండకుండా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఇటాలియన్ ఎస్ప్రెస్సో కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉదయం నిద్రలేవగానే పొగలుకక్కుతూ నురుగుతో నిండిన కప్పు ఎస్ప్రెస్సో కాఫీ లేకుండా తమ రోజును ప్రారంభించరు. ఇక మెక్సికో, ఫ్రాన్స్, క్యూబాలో కాఫీ తాగని వారుండరంటే అతిశయోక్తి కాదు. మెక్సికన్లు బ్రౌన్ షుగర్‌తో మట్టి కుండల్లో తయారుచేసిన కాఫీని తాగుతారు. రెస్టారెంట్లలో కూర్చుని కాఫీ తాగడానికి ఫ్రెంచ్ ప్రజలు అస్సలు ఇష్టపడతారు.
టర్కీలో కాఫీ కొంత వింతగా ఉంటుంది. ఎందుకంటే ఇది అమావాస్య రాత్రిలా నల్లగా, చిక్కగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ కాఫీని అక్కడి ప్రజలు అమితంగా ఇష్టపడతారు. ‘ఉప్పు కలిపిన కాఫీ’ రుచి ఎప్పుడైనా చూశారా? యాక్.. అంటున్నారా? ఉప్పు కలిపిన కాఫీ తాగడం వల్ల మీ రక్తం నీళ్లలా పలుచగా ఉండకుండా నివారిస్తుంది. వింతగా అనిపించినా సాల్టెడ్ కాఫీ చరిత్ర చాలా పాతది. ఐతే కాఫీలో ఉప్పు నేరుగా కలపకుండా సహజంగా కలిసిన నీళ్లను ఇందుకు ఉపయోగిస్తారు. టర్కీ, హంగేరీ వంటి దేశాల్లో సముద్రం నీరు నదుల్లో కలిసే చోట (Estuaries) నుంచి నీటిని సేకరించి తాగునీరుగా మారుస్తారు. ఫలితంగా ఈ నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిలో కాఫీని కాచినప్పుడు, కాఫీ సహజంగా ఎక్కువ నురుగును ఉత్పత్తి చేస్తుంది. కాఫీకి కూడా అంత చేదు రుచి ఉండదు.
కాఫీలో ఉప్పు కలిపితే ఏమవుతుందంటే..
పులుపు, తీపి, చేదు, ఉప్పు, లవణం అనే ఐదు రకాల రుచులను మన నాలుక గుర్తిస్తుంది. ఈ ఐదు రుచుల సమ్మేళనాలతో చేదు ఉద్భవిస్తుంది. ఎందుకంటే నాలుకపై ఉండే రుచి మొగ్గలు కాల్షియం అయాన్‌లను విడుదల చేస్తాయి. కెఫిన్ కూడా కాఫీ రుచిని కొంచెం చేదుగా చేస్తుంది. ఫలితంగా, రుచి మొగ్గల నుంచి కాల్షియం అయాన్లు విడుదలై మెదడుకు చేరి, చేదు రుచి సందేశాన్ని అందిస్తాయి. మరోవైపు.. ఉప్పులోని సోడియం అయాన్లు లవణం రుచిని విడుదల చేస్తాయి. కాబట్టి ఉప్పు కలిపిన కాఫీ తాగితే చేదు రుచి కొంత తగ్గి, తీపి రుచి అనుభూతి క్రమంగా కలుగుతుంది.
సాల్ట్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలంటే..
ఉప్పును నేరుగా నీటిలో కలపకూడదు. కాఫీకి ఉప్పు కలుపుకోవాలి. అంటే కాఫీ గింజలతో పౌడర్ తయారు చేసే సమయంలో ఉప్పు కలుపుకోవాలి. కాఫీ పౌడర్‌ని ఉప్పుతో కలిపిన తర్వాత గోరువెచ్చని నీటితో కాఫీ తయారు చేసుకోవాలి. సుమారు 10 గ్రాముల కాఫీ పొడికి 0.1 గ్రాముల ఉప్పు కలుపుకోవాలి. అంటే కాఫీ పొడి, ఉప్పు నిష్పత్తి 100:1గా ఉండాలి. కాఫీలో పాలు కలుపుకునే బదులు సాల్టెడ్ బ్లాక్ కాఫీ తాగడం మంచిది.