Tea Health: టీ బ్యాగులతో క్యాన్సర్ రావచ్చు.. ఆ పద్ధతిని మానుకోకుంటే ఇక మీ ఇష్టం.. నిపుణుల వార్నింగ్
ఉదయాన్నే నిద్రలేవగానే టీ (Tea) తాగితే కలిగే అనుభూతే వేరు. కుర్చీలో కూర్చుని, పేపర్ చదువుకుంటూ వేడి వేడి టీని సిప్ చేస్తుంటే.. అబ్బా ఎంత బాగుందో కదా. నిజమే.. టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం...
ఉదయాన్నే నిద్రలేవగానే టీ (Tea) తాగితే కలిగే అనుభూతే వేరు. కుర్చీలో కూర్చుని, పేపర్ చదువుకుంటూ వేడి వేడి టీని సిప్ చేస్తుంటే.. అబ్బా ఎంత బాగుందో కదా. నిజమే.. టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. సాధారణంగా వేడి నీళ్లు, వేడి పాలలో టీ పొడి గానీ డికాప్షన్ వేసుకుని తాగడం మనకు అలవాటు. కానీ కొన్ని సందర్భాల్లో గరం గరం చాయ్ కోసం టీ బ్యాగ్‌లపై ఆధారపడుతుంటాం. సమయం లేదనో, త్వరగా అయిపోతుందనే ఎక్కువగా టీ బ్యాగ్స్ వాడడానికి అలవాటుపడిపోయాం. అయితే ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి ఉపయోగాలు కంటే ఇబ్బందులే ఎక్కువ కలుగుతాయని నిపుణులు (Health Experts) హెచ్చరిస్తున్నారు. మాంట్రియల్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం పరిశోధనల అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ టీబ్యాగ్ హానికరమైన కణాలను విడుదల చేస్తుంది. టీ బ్యాగులు బిలియన్ల మైక్రో, నానో ప్లాస్టిక్‌లను వేడి నీటిలో కలిసిపోతాయి. పేపర్ టీ బ్యాగ్‌లలో ఎపిక్లోరోహైడ్రిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది బ్యాగ్ చినిగిపోకుండా ఉపయోగపడుతుంది. టీ బ్యాగ్‌లలో డయాక్సిన్ లేదా ఎపిక్లోరోహైడ్రిన్ పూత ఉంటుంది. కాబట్టి టీ బ్యాగ్ ను వేడి నీరు లేదా వేడి పాలల్లో ముంచినప్పుడు కవర్ లోని కణాలు కరిగిపోతాయి. మనకు తెలియకుండా అలాగే తాగేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కణాలు క్యాన్సర్ కు రారకాలుగా మారతాయని నిపుణులు హెచ్చరించారు.
అందుకే టీ బ్యాగ్‌లకు బదులుగా పొడి లేదా వదులుగా ఉండే టీ ఆకులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ అత్యవసరంగా టీ బ్యాగులను వాడాల్సి వస్తే గుడ్డతో చేసిన టీ బ్యాగ్‌లను ఎంచుకోవాలని చెబుతున్నారు. తద్వారా ఆరోగ్య దుష్ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. మనం చేసే కొన్ని కొన్ని మార్పుల వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు వివరించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..