Health: రోజూ నిద్ర లేవగానే ఈ పని అలవాటు చేసుకోండి.. నిపుణులు ఏమంటున్నారంటే
తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధ గుణాల కారణంగా విశేష ఆదరణ పొందింది. తులసిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచీ...
తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధ గుణాల కారణంగా విశేష ఆదరణ పొందింది. తులసిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచీ ఉపశమనం లభిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం నిద్రలేవగానే పరిగడుపున తులసి నీళ్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులను రోజూ నమిలితే దంతాలు, చిగుళ్లు బలంగా మారతాయి. తులసి ఆకులు శరీర బరువును తగ్గిస్తాయి. శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. వీటి ఆకులను నీటిలో మరిగించి, చిటికెడు పసుపు వేసి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో తులసిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. * అసిడిటీ సమస్య ఉన్నవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 2-3 తులసి ఆకులను నమలి రసం తాగాలి. కడుపునొప్పితో బాధపడేవారు మంచినీళ్లలో తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. జీర్ణ సమస్యల నుంచి ఊరట కలిగిస్తుంది. తులసి రసం, తులసి ఆకులను రోజూ తీసుకుంటే రోగాలకు దూరంగా ఉండవచ్చు. ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. అందులో కొన్ని తులసి ఆకులు వేసి 2-3 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. చల్లారాక వడగట్టి తాగాలి.
వర్షాకాలంలో చాలా మంది జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే తులసి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. వేడి వేడిగా ఏదైనా తాగాలని అనిపిస్తే తులసి నీళ్లను వేడి చేసుకుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని మూలల్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే తులసి నీటిని తాగాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వచ్చే జ్వరం నుంచి కాపాడుతుంది. తులసిలో ఉండే ఔషధ గుణాల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.