Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుమ్మడి పండుతో బోటు..38 మైళ్లు నదిలో ప్రయాణం.. దెబ్బకు గిన్నిస్​ రికార్డు పట్టేశాడు

సముద్రంలో, నదిలో, సరస్సుల్లో బోటు (Boat) షికారు అంటే ఇష్టపడని వారుండరు. నదిలో మరబోట్లలో రయ్‌య్‌ మని దూసుకుపోతోంటే ఆ అనుభూతే వేరు. చాలా మంది ఈ అనుభూతిని జ్ఞాపకాలుగా మలుచుకుంటారు....

Viral Video: గుమ్మడి పండుతో బోటు..38 మైళ్లు నదిలో ప్రయాణం.. దెబ్బకు గిన్నిస్​ రికార్డు పట్టేశాడు
Pumpkin Boat
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 05, 2022 | 10:53 AM

సముద్రంలో, నదిలో, సరస్సుల్లో బోటు (Boat) షికారు అంటే ఇష్టపడని వారుండరు. నదిలో మరబోట్లలో రయ్‌య్‌ మని దూసుకుపోతోంటే ఆ అనుభూతే వేరు. చాలా మంది ఈ అనుభూతిని జ్ఞాపకాలుగా మలుచుకుంటారు. కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే నదులు దాటాల్సి ఉంటుంది. వంతెన అందుబాటులో లేకపోతే పడవలు, మరబోట్లలోనో, షిప్స్‌లోనో ప్రయాణం చేస్తాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చిన్న చిన్న కాలువల్లాంటివి దాటడానికి తెప్పలను వాడుతుంటారు. అయితే ఇప్పుడు మీకు ఓ అద్భుతమైన బోటును పరిచయం చేయబోతున్నాం. ఇలాంటి పడవను మీరు జీవితంలో చూసి ఉండరు. అది చూస్తే మీకూ అందులో ప్రయాణించాలనిపిస్తుంది. గిన్నిస్‌ రికార్డును సైతం కొట్టేసిన ఆ బోట్‌ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. అమెరికాకు చెందిన డ్యూన్‌ హాన్సెన్‌ గుమ్మడి పండును బోటులా చేసుకుని నదిలో ఏకంగా 38 మైళ్లు అంటే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంతే కాదు గిన్నిస్ బుక్ రికార్డు (Guninness Record) కూడా కొట్టేశాడు. మిస్సోరీ నదిలో ఇటీవలే ఈ ఫీట్ చేశాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా సాధించాలనుకున్న ఆయన ఇలా గుమ్మడిపండు బోటులో ప్రయాణించి రికార్డు సాధించాడు.

ఇంతకుముందు 2016 లో వాషింగ్టన్‌కు చెందిన రిక్‌స్వెన్సన్‌ అనే వ్యక్తి గుమ్మడిపండు బోట్‌లో 25.5 మైళ్ల దూరం ప్రయాణించి రికార్డు నెలకొల్పగా దానిని డ్యూన్‌ హాన్సెన్‌ బ్రేక్‌ చేశాడు. ఓ పెద్ద గుమ్మడి పండును తెప్పించుకుని.. దాని లోపలి భాగమంతా తొలగించి చిన్న బోటులా మార్చుకున్నాడు. బెల్లూవ్స్ గ్రామం నుంచి నెబ్రస్కా పట్టణం వరకు 38 మైళ్ల దూరం ఈ గుమ్మడి పండు బోటులో డ్యూన్ ప్రయాణించాడు. ఎవరి సాయం లేకుండా ఒక్కడే తెడ్డు సాయంతో ప్రయాణించాడు. దీనంతటినీ గిన్నిస్ బుక్ ప్రతినిధులు పరిశీలించి, రికార్డు చేతిలో పెట్టేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..