Summer Skin Care: సన్ ట్యాన్‌తో ముఖం నల్లగా మారిందా.. పెరుగుతో చెక్ పెట్టండి..

ముఖం ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని స్కిన్ కావాలని కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ వేసవి కాలం వచ్చిదంటే.. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న చర్మ సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక పని మీద బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ట్యాన్ అవుతారు. కాబట్టి సమ్మర్‌లో చర్మం కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంపై సూర్య రశ్మి పడకుండా..

Summer Skin Care: సన్ ట్యాన్‌తో ముఖం నల్లగా మారిందా.. పెరుగుతో చెక్ పెట్టండి..
Summer Skin Care
Follow us
Chinni Enni

|

Updated on: Mar 23, 2024 | 2:25 PM

ముఖం ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎలాంటి మొటిమలు, మచ్చలు లేని స్కిన్ కావాలని కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ వేసవి కాలం వచ్చిదంటే.. ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న చర్మ సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక పని మీద బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ట్యాన్ అవుతారు. కాబట్టి సమ్మర్‌లో చర్మం కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మంపై సూర్య రశ్మి పడకుండా.. కవర్ చేసుకోవాలి. వేసవిలో ముఖం నల్ల బడకూడదు అనుకుంటే.. ఒకవేళ నల్లబడిన ముఖాన్ని మళ్లీ తెల్లగా మార్చుకోవాలంటే.. ఇంట్లో ఉండే పెరుగు బాగా సహాయ పడుతుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ని, మురికిని తొలగించి క్లీన్‌గా కాంతి వంతంగా మార్చుతుంది. పెరుగులో ఇంకొన్ని పదార్థాలను చేర్చి ఫేస్ ప్యాక్‌గా ముఖాన్ని అప్లై చేసుకోవచ్చు.

పెరుగు – బియ్యం పిండి:

ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా బియ్యం పిండి, పెరుగును రెండూ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. తర్వాత దీన్ని మెడ, ముఖం, చేతులకు బాగా పట్టించాలి. నెక్ట్స్ 10 – 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ఫేస్‌ని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. నల్లటి చర్మం తెల్లగా మారుతుంది.

పెరుగు – తేనె:

ఈ చిట్కా కూడా బాగా పని చేస్తుంది. ముఖాన్ని సాఫ్ట్‌గా, గ్లోగా తయారు చేస్తుంది. ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగు, తేనెను రెండూ కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. తర్వాత దీన్ని మీ శరీరంపై నలుపుగా ఉన్న భాగాల్లో అప్లై చేసుకోవాలి. నెక్ట్స్ ఇది బాగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో ఫేస్‌ని కడగాలి.

ఇవి కూడా చదవండి

పెరుగు – అలోవెరా జెల్:

పెరుగే కాకుండా అలోవెరాలో కూడా చర్మానికి ఉపయోగపడే మంచి పోషకాలు ఉన్నాయి. ఒక చిన్న బౌల్‌లో పెరుగు, కొద్దిగా అలోవెరా జెల్ తీసుకుని.. రెండూ బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని మెడ, ముఖం, చేతులకు బాగా పట్టించాలి. నెక్ట్స్ 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో ఫేస్‌ని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..