Cooler Smell: కూలర్ నుంచి కంపు వాసన వస్తుందా? కారణం ఇదే కావచ్చు..! ఎలా పోగొట్టాలంటే?
సమ్మర్ ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు, వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్స్ చాలా బాగా ఉపయోగపడుతాయి. అయితే దీన్ని వాడే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏమిటంటే దాని నుంచి వచ్చే దుర్వాసన. ఎక్కువ రోజులు వాడడం వల్ల కూలర్ నుండి నాచు వాసన లేదా నీచు వాసన వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి చాలా మంది సెంట్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే చిట్కాను పాటిస్తే.. కూలర్ నుంచి సువాసనతో పాటు గాలి కూడా చల్లగా వస్తుంది. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ కూలర్ నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం కూలర్ లోపల ఉండే గడ్డి, మనం కూలర్‌లో పోసిన వాటర్ పంపింగ్ జరిగినప్పుడు ఈ గడ్డి తడిచి, చల్లని గాలిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ తడి గడ్డిపై సూక్ష్మజీవులు చేరి, కాలక్రమేణా నీచు వాసన లేదా నాచు వాసన వంటి దుర్వాసనను ఉత్పత్తి చేస్తాయి. కొత్త కూలర్‌లలో కూడా కొన్నిసార్లు ఈ సమస్య కనిపించవచ్చు. ఈ వాసనను నివారించడానికి చాలా మంది వాటిలో సెంట్స్, కంపర్ట్ వంటి ద్రవాలు వేస్తూ ఉంటారు. ఇది కూడా కూలర్ నుంచి వచ్చే చెడు వాసనను దూరం చేస్తుంది.
సువాసన ద్రవాలు వాడడం: ఇందుకోసం మీరు కూడా ఒక గ్లాసు నీటిలో సగం కంఫర్ట్ కలిపి, ఆ మిశ్రమాన్ని కూలర్ వాటర్ పంపింగ్ జరిగే ప్రాంతంలో వేయాలి. ఇలా చేయడం వల్ల కంఫర్ట్ ద్రవం కూలర్‌లోని నీటి ట్యాంక్‌లో కలిసి, వాసనను సమర్థవంతంగా అరికడుతుంది. కంఫర్ట్ మాత్రమే కాకుండా, షాంపూ, డెటాల్, లేదా రూమ్ ఫ్రెష్నర్‌లను కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ ద్రవాలలో ఏదైనా ఒకటి కూలర్ నీటిలో కలపడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది.
కిటికీలు ఓపెన్ చేయడం: మరో చిట్కా ఏమింటంటే సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం. చాలామంది కూలర్ ఉపయోగిస్తున్నప్పుడు గదిలోని అన్ని తలుపులు, కిటికీలను మూసివేస్తారు, ఇది సరైన పద్ధతి కాదు. కూలర్ నడుస్తున్నప్పుడు గదిలోని కిటికీలను వీలైనంత వరకు తెరిచి ఉంచాలి. బయటి గాలి లోపలికి వచ్చి, కూలర్ నుండి వచ్చే గాలితో కలవడం వల్ల గదిలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గదిలోని గాలిని మరింత తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది రూమ్‌లో వాసన పేరుకుపోకుండా నివారిస్తుంది.
కూలర్ నీటని మార్చడం: మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే కూలర్ నీటిని క్రమం తప్పకుండా మార్చడం. కూలర్‌లోని నీటిని ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మార్చడం చాలా ముఖ్యం. చాలా సందర్భాలలో, వాసన నీటి నుండి కాకుండా తడి గడ్డి నుండి వస్తుంది. అయితే, ట్యాంక్‌లోని నీరు ఎక్కువ కాలం ఉండిపోవడం వల్ల కూడా సూక్ష్మజీవులు పెరిగి వాసన మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. నీటిని మార్చడం ద్వారా కూలర్ లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు, తద్వారా దుర్వాసన వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
గడ్డిని మార్చం: చాలా సందర్భాల్లో కూలర్ నుంచి దుర్వాసన రావడానికి ప్రధానం కారణం దానిలో ఉండే గడ్డి, అది నిరంతరం తడుస్తూ ఉంటుంది.కాబట్టి దానిపై బ్యాక్టిరియా పేరుకుపోయి అది కుల్లిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ కూరల్ నుంచి దుర్వాసన వస్తుంటే..దానికి ఉన్న గడ్డిని మార్చుకోండి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా, మీరు మీ ఎయిర్ కూలర్ నుండి వచ్చే చెడు వాసనను సమర్థవంతంగా నివారించవచ్చు వేసవిలో చల్లని, తాజా గాలిని పూర్తిగా ఆస్వాదించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
