వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్.. ఆరోగ్యానికి ఏది మంచిది?

09 jun 2026

Anand T

మన మార్కెట్‌లో రకరకాల రైస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొందరు తెల్లబియ్యం తినేందుకు ఇష్టపడితే మరికొందరు బ్రౌన్ రైస్ తినేందుకు ఇష్టపడుతారు.

ఇవి రెండు ఆరోగ్యానికి మంచివే. కానీ తెల్ల బియ్యాన్ని తయారు చేసే ప్రక్రియలో వాటిపై ఉండే తవుడు పొరను పూర్తిగా తొలగిస్తారు, దీనివల్ల అందులోని పోషకాలు నశించిపోతాయి.

కానీ బ్రౌన్‌ రైస్‌లో మాత్రం తవుడు పొర అలాగే ఉండటం వల్ల ఇది శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది.

అంతేకాదు తెల్ల బియ్యంతో పోల్చుకుంటే బ్రౌన్‌ రైస్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి

 గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మట్టా అన్నం తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. తెల్ల అన్నంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

 అలాగే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సులభంగా సాగడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. తెల్ల బియ్యంలో ఫైబర్ చాలా తక్కువ.

శరీర బరువును తగ్గించుకోవాలని లేదా నియంత్రణలో ఉంచుకోవాలని అనుకునే వారికి బ్రౌన్ రైస్‌తో చేసిన అన్నం తినడం ఎంతో ఉత్తమం.

మొత్తంగా రెండింటిలో ఏది మంచి అనేది మన అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, మీకు షుగర్ ఉన్నా బ్రౌన్ రైస్ మంచిది. అలాగే మీకు తక్కవ ఫైబర్, కార్బోహైడ్రెట్స్ కావలి అనుకుంటే వైట్ రైస్ మంచింది.