Prawns Side Effects: రొయ్యలు ఆరోగ్యానికి మంచివే.. ఈ సమస్యలున్నవారు.. వీటితో కలిపి తింటే ఎంత హనికరమో తెలుసా..
మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ని ఇష్టంగా తినేవారు ఉంటారు. ఈ సీ ఫుడ్ లో రొయ్యలను కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఈ రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి.. కనుక వీటిని తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పును పెంచే ట్రైగ్లిజరైడ్స్‌ను తరచుగా రొయ్యలను తినడం వలన తగ్గించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రొయ్యలలో కోలిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే రొయ్యలు తినడం కొంతమంది ఆరోగ్యానికి హానికరం.
చేపలు, రొయ్యలు, పీతలు, స్టార్ ఫిష్ వంటి అనేక రకాల సీ ఫుడ్స్ ఉన్నాయి. వీటిల్లో చాలామంది రొయ్యలను చాలా ఇష్టంగా తింటారు. వివిధ రకాల వంటకాలను రొయ్యలతో తయారుచేస్తారు. రొయ్యలు సరిగ్గా వండినట్లయితే వీటి రుచి చాలా బాగుంటుందని చెబుతారు. రొయ్యలు రుచితో పాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రొయ్యలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి12, సెలీనియం, ఫాస్పరస్ మొదలైనవి రొయ్యల్లో ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో కేలరీలు చాలా తక్కువ. అయితే ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. మూడు ఔన్సుల రొయ్యలు 84 కేలరీలు, 20 గ్రాముల ప్రోటీన్లను కలిగి ఉన్నాయి.
రొయ్యలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రొయ్యలలో కోలిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.
రొయ్యలు తింటే కొంతమందికి అలెర్జీ
అయితే కొంతమంది రొయ్యలను తింటే అలెర్జీ సమస్యతో ఇబ్బంది పడతారు. కేరళలో రొయ్యలు తిన్న తర్వాత అలెర్జీ ప్రతిచర్యల కారణంగా కొంత మంది మరణించారు. కొందరికి రొయ్యలలోని ప్రోటీన్ అంటే అలెర్జీ ఉంటుంది. అరుదుగా రొయ్యలను తిన్నప్పుడు అనాఫిలాక్సిస్ అనే అలెర్జీ ప్రతిచర్యను అనుభవిస్తారు. ఊపిరాడక గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. అలా మరణం సంభవిస్తుంది.
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ రొయ్యలలోని ట్రోపోమియోసెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది అలెర్జీలకు కారణమవుతుంది. అయితే ఇలాంటి అలెర్జీలలో మరణాల రేటు తక్కువగా ఉంటుంది. ఎవరైనా రొయ్యలను తినడం వలనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఎవరైనా రొయ్యలను తినడం వలన అలెర్జీ సమస్యతో ఇబ్బంది పడుతుంటే వాటిని తినకపోవడమే మంచిది. ఈ అలెర్జీ ప్రధాన లక్షణం దురద. శ్వాసకోశ సమస్య. కొందరికి తలతిరగడం, స్పృహ తప్పడం వంటి సమస్యలు కూడా ఉంటాయి.
రొయ్యలతో కూడిన కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రొయ్యలు, నిమ్మరసం కలిపి తినకూడదని కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇది అవాస్తవమని నిపుణులు స్పష్టం చేశారు. రొయ్యలు, నిమ్మకాయలను కలిపి తింటే ఆరోగ్య సమస్య వస్తుందనేది అపోహ. అయితే కొందరికి రొయ్యల వల్ల అలర్జీ వస్తుందని.. నిమ్మకాయకు ఇందులో ఎలాంటి పాత్ర లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే రొయ్యలతో పాటు మరికొన్ని వంటకాలను కలిపి తినవద్దు అని.. కొన్ని కాంబినేషన్స్ కు దూరంగా ఉండమని చెబుతున్నారు.
రొయ్యలతో వేటిని కలిపి తినొద్దు అంటే
రొయ్యలను పాల ఉత్పత్తులను కలిపి తినొద్దు. పాల ఉత్పత్తులతో రొయ్యల కలయిక కొన్నిసార్లు అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందని నిపుణులు వెల్లడించారు. కడుపు నొప్పి సమస్య కూడా తలెత్తవచ్చు. రొయ్యలతో పాటు స్పైసీ ఫుడ్స్ కూడా తినొద్దు అని సూచిస్తున్నారు. రొయ్యలతో పాటు బ్రెడ్, పాస్తా, పిండి పదార్ధాలను తినొద్దు. రొయ్యలతో ఎక్కువ పిండి పదార్ధాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రొయ్యలతో కలిపి ఎక్కువ సిట్రస్ పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. Source
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)