Cooking Hacks: కుక్కర్ లో వండిన అన్నం ముద్దగా అవుతోందా?.. మీరు చేస్తున్న పొరపాటు ఇదే..
దక్షిణ భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. సమయం ఆదా అవుతుందని ఇప్పుడు అందరూ ప్రెషర్ కుక్కర్లపైనే ఆధారపడుతున్నారు. కానీ, చాలామందికి కుక్కర్‌లో అన్నం వండినప్పుడు అది ముద్దగా అవ్వడమో లేదా అడుగు అంటుకోవడమో జరుగుతుంటుంది. అసలు కుక్కర్‌లో కూడా అన్నాన్ని పక్కా కొలతలతో, పొడిపొడిగా ఎలా వండాలి? మీ వంట గదిలో అన్నం వండే విధానాన్ని మార్చేయబోతోంది.

అన్నం సరిగ్గా ఉడకకపోతే కూర ఎంత బాగున్నా భోజనం తృప్తినివ్వదు. బియ్యాన్ని నానబెట్టడం నుండి కుక్కర్ విజిల్ వచ్చాక ఎంతసేపు ఆగాలో తెలియక చాలామంది తప్పులు చేస్తుంటారు. ఒక కప్పు బియ్యానికి ఎన్ని కప్పుల నీరు పోయాలి? బాస్మతి బియ్యానికి, సాధారణ బియ్యానికి ఉన్న తేడా ఏంటి? అన్నం గింజలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే వంటలో వాడాల్సిన ఆ సీక్రెట్ పదార్థాలు ఏవి? అనే ఆసక్తికరమైన అంశాలను చూద్దాం.
శుభ్రంగా కడగడం: బియ్యం పై ఉండే అదనపు పిండి పదార్థం (Starch) పోయే వరకు 2-3 సార్లు కడగాలి. నీరు స్వచ్ఛంగా వచ్చే వరకు కడిగితే అన్నం జిగురుగా అవ్వదు.
నానబెట్టడం: వండే ముందు బియ్యాన్ని 15-20 నిమిషాల పాటు నానబెడితే గింజలు విరగకుండా, సమానంగా ఉడుకుతాయి.
నీటి కొలత : సాధారణ బియ్యానికి: 1 కప్పు బియ్యం = 2 కప్పుల నీరు.
బాస్మతి బియ్యానికి: 1 కప్పు బియ్యం = 1.5 నుండి 1.75 కప్పుల నీరు.
కుక్కర్‌లో ఎసరు పోసిన తర్వాత అర చెంచా నెయ్యి లేదా నూనె కలిపితే గింజలు అంటుకోవు. రెండు చుక్కల నిమ్మరసం కలిపితే అన్నం తెల్లగా, విడివిడిగా వస్తుంది.
వెంటనే కలపవద్దు: కుక్కర్ విజిల్ వచ్చాక ఆవిరి మొత్తం పోయే వరకు ఆగాలి. మూత తీసిన వెంటనే అన్నాన్ని కలపకుండా ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత స్పూన్‌తో మెల్లగా కలిపితే అన్నం పొడిపొడిగా ఉంటుంది.
సరైన పద్ధతిలో కుక్కర్‌ను ఉపయోగిస్తే సమయం, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా రుచికరమైన భోజనం మీ సొంతం అవుతుంది.
చిన్న చిట్కా: కుక్కర్ విజిల్ రాగానే గ్యాస్ ఆపేసి, ఆవిరి తనంతట తానుగా పోయే వరకు వదిలేయాలి. బలవంతంగా ఆవిరి తీసేస్తే అన్నం సరిగ్గా ఉడకదు.
