Watch: అద్భుత దృశ్యం.. రామ భక్తితో అగ్గిపెట్టెపై రామాయణాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
అ చిత్రకారుడికి శ్రీ రాముడు అంటే ఎనలేని భక్తి,రాముడి పై తనకు ఉన్న భక్తిని చిత్రం రూపంలో చూపించాలనుకున్నాడు. తన ప్రతిభను, శ్రీ రాముడిపై తనకు ఉన్నభక్తిని చాటుతూ చిన్న అగ్గి పెట్టెపై శ్రీరాముడి జననం నుంచి సీతాదేవి అగ్నిపరీక్ష వరకు జరిగిన ప్రధాన ఘట్టాలన్నింటిని సూక్ష్మ రూపంలో అద్బతంగా వేసి అందిరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకూ ఆ అమిత భక్తులు ఎవరో తెలుసుకుందాం పదండి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్.. శ్రీరామనవమి పర్వదినం పురష్కరించుకొని చిన్న సైజు అగ్గి పెట్టెపై అద్బుతమైన చిత్రాలు గీశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమిస్తూ మనసులో శ్రీరామ జపం చేసుకుంటూ మైక్రో పెన్నుతో, వాటర్ కలర్స్ ఉపయోగిస్తూ రామాయణంలోని ప్రధాన ఘట్టాలు అగ్గిపెట్టెపై వేసారు. కేవలం రెండు అంగుళాల పొడవు, రెండున్నర అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టె పై తన మనసులో ఉన్న రామాయన చిత్రాలను అద్బతంగా గీశాడు.
ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ తాను వేసిన ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతా దేవి అగ్ని పరీక్ష వరకు అన్ని ఘట్టాలు ఉన్నాయన్నారు. శ్రీ మహావిష్ణువే త్రేత యుగంలో దశరథ మహారాజుకు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముడు అంతటి సత్యవంతుడు, దయామయుడు, పురుషోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శ ప్రాయుడు, పితృ వాక్యపరిపాలకుడుని కొనియాడారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ ప్రాయుడని, ఏకపత్ని వ్రతుడని, సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడని తెలిపాడు. శ్రీ రాముడి పరిపాలనలో ప్రజలను కన్న బిడ్డలాగ చూసుకునేవారన్నారు.
అందుకే రామాయణం గురించి ఎన్ని సార్లు విన్న, రామాయణం గురించి ఎన్ని సార్లు బొమ్మలు వేసిన తనివి తీరదన్నారు.తాను వేసిన ఈ చిత్రంలో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి వారు తమ పిల్లలైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలను ముద్దాడు తున్నట్లు, రామ, లక్ష్మణులు విశ్వామిత్రుని దగ్గర విలు విద్యలు నేర్చుకుంటున్నట్లు, యజ్ఞం భంగం చేస్తున్న రాక్షసులను రామలక్ష్మణులు సంహారిస్తున్నట్లు ఉందన్నారు. అహల్య శాప విమోచన, రాముడు శివ ధనుస్సు విరిచినట్లు, సీతారాముల కళ్యాణం, తండ్రి దగ్గర సెలవు తీసుకొని వనవాసం వెళుతున్న రామ, లక్ష్మణ, సీతమ్మ, పాదరక్షలు భరతుడు తీసుకున్న దృశ్యాలు ఉన్నాయన్నారు.
రామునికి జింకను చూపిస్తున్న సీతమ్మ, మారు వేషంలో రావణుడు, రామునికి ప్రేమతో పళ్ళు తినిపిస్తున్న శబరి,వాలి సంహారం, సీతమ్మ జాడ కోసం హనుమంతుడు ఆకాశంలో పోతున్న హనుమంతుడు కనిపిస్తాడని తెలిపారు. హనుమంతుడు లంకా దహనం చేసిన చిత్రంతో పాటు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులతో యుద్ధం చేస్తున్న రామలక్ష్మణులు, యుద్ధంలో మూర్ఛ పోయిన లక్ష్మణుడు, సంజీవ పర్వతం తెస్తున్న హనుమాన్ చిత్రాలు ఉన్నాయన్నారు.
అలాగే రామ రావణ యుద్ధంలో రావణుడి సంహారం, అగ్ని పరీక్షలో మహా సాద్వి సీతమ్మ వున్నట్లు ఇలా ఇన్ని ప్రధాన ఘట్టాలను చిన్న అగ్గిపెట్టె పై వేసానని తెలిపారు. శ్రీరాముని మీద వున్నా భక్తితో ఈ చిత్రం వేసానని.. భక్తులందరికి ఆ రామయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
