AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అరేయ్ ఏంట్రా ఇది.. ఐపీఎల్ సీజన్ అని.. ఇంట్లోనే దర్జాగా డెన్ పెట్టారు.. కట్ చేస్తే..

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈనెల 17న జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.

Andhra: అరేయ్ ఏంట్రా ఇది.. ఐపీఎల్ సీజన్ అని.. ఇంట్లోనే దర్జాగా డెన్ పెట్టారు.. కట్ చేస్తే..
Ipl Betting
B Ravi Kumar
| Edited By: |

Updated on: Apr 19, 2026 | 7:48 PM

Share

ఏలూరు: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈనెల 17న జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇందుకు సంబంధించిన ప్రధాన నిందితులు హైదరాబాద్ కెపిహెచ్‌బీ కాలనీలో ఉన్నారని తెలుసుకుని వెంటనే ఒక టీం గా ఏర్పడి అక్కడికి వెళ్లి ఐదుగురిని అరెస్టు చేశారు.

వీరందరూ క్రికెట్ మెయిన్ బుకి, సబ్ బుకీలుగా వ్యవహరిస్తూ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తూ సిండికేట్ గా మారి పంటర్స్ (పందెం వేసే వారు) ను ఆకర్షిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రు. 2.30 లక్షల నగదు, రెండు లాప్టాప్ లు, ఒక ఐపాడ్, వైఫై సిస్టం, వివిధ బ్యాంకు ఎకౌంటులకు చెందిన సుమారు నాలుగు లక్షల రూపాయలు నగదు, 12 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ కు ఉపయోగించే సిమ్ బాక్స్ స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పి సుస్మిత తెలిపారు.

వీడియో చూడండి..

బెట్టింగ్ నిర్వహించడం, వేయడం నేరమని.. ఎవరైనా ఇలాంటి నేరాలు చేస్తే.. సహించేది లేదని ఎస్పీ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us