Veg Protein: చికెన్ దొరకదని భయపడుతున్నారా? మాంసానికి గట్టి పోటీనిచ్చే 4 సూపర్ ఫుడ్స్ ఇవి..
ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్ లేదా గుడ్లు. జిమ్ చేసేవారైనా, బరువు తగ్గాలనుకునే వారైనా చికెన్ వెంటే పడుతుంటారు. కానీ, శాఖాహారంలో కూడా చికెన్ స్థాయికి మించిన ప్రోటీన్ లభిస్తుందని మీకు తెలుసా? కేవలం రుచి కోసమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని అందించే ఆ 'సూపర్ వెజ్' ఫుడ్స్ ఏవి? చికెన్ లేకపోయినా మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను ఎలా పొందాలో తెలుసుకుందాం..

శాకాహారులు ప్రోటీన్ విషయంలో వెనుకబడి ఉంటారనేది ఒక పెద్ద అపోహ! సోయా చంక్స్ నుండి పుట్టగొడుగుల వరకు మన చుట్టూ ఉన్న ఆహార పదార్థాల్లో అద్భుతమైన పోషక విలువలు దాగి ఉన్నాయి. 100 గ్రాముల చికెన్‌లో లభించే ప్రోటీన్ కంటే.. తక్కువ ధరలో దొరికే ఒకే ఒక్క పదార్థంతో అంతకంటే ఎక్కువ బలాన్ని పొందవచ్చు. మరి ఆ పదార్థం ఏంటి? పప్పు ధాన్యాలను ఎలా తీసుకుంటే చికెన్ అంత శక్తి వస్తుంది? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోండి..
సోయా చంక్స్ :
దీనిని ‘శాఖాహారుల మాంసం’ అని పిలుస్తారు. 100 గ్రాముల చికెన్‌లో సుమారు 25-30 గ్రాముల ప్రోటీన్ ఉంటే, అదే 100 గ్రాముల సోయా చంక్స్‌లో ఏకంగా 50 గ్రాముల పైగా ప్రోటీన్ ఉంటుంది. అంటే చికెన్ కంటే రెట్టింపు శక్తి అన్నమాట!
పనీర్ :
పాల నుండి తయారయ్యే పనీర్ ప్రోటీన్‌తో పాటు కాల్షియంకు పెట్టింది పేరు. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18-20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.
పుట్టగొడుగులు :
తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు కావాలనుకునే వారికి మష్రూమ్స్ బెస్ట్ ఛాయిస్. ఇందులో ప్రోటీన్‌తో పాటు విటమిన్-డి కూడా పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తిన్న ఫీలింగ్‌ను ఇవి కలిగిస్తాయి.
పప్పు ధాన్యాలు :
రాజ్మా, శనగలు, పెసర్లు మరియు కందులలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. పప్పు ధాన్యాలను బియ్యంతో కలిపి (ఖిచడీ లేదా పప్పు-అన్నం) తీసుకున్నప్పుడు, అది చికెన్‌లో ఉండే అన్ని రకాల ఎమినో యాసిడ్లను శరీరానికి అందిస్తుంది.
నిపుణుల సూచన:
మీరు తీసుకునే ఆహారంలో ఈ నాలుగు పదార్థాలను మార్చి మార్చి చేర్చుకోవడం వల్ల చికెన్ తినకపోయినా శరీరానికి కావాల్సిన సంపూర్ణ ప్రోటీన్ అందుతుంది.
సోయా చంక్స్‌ను వండే ముందు వేడి నీటిలో వేసి బాగా పిండిన తర్వాత వాడితే అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ తొలగిపోయి ప్రోటీన్ బాగా అందుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనిానికి బాధ్యత వహించదు. కిడ్నీ సమస్యలు లేదా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు హై-ప్రోటీన్ డైట్ తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
