Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Pepper : మిరియాల ఘాటు ఆరోగ్యానికి మంచిదే..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన మార్గం..

Black Pepper : నల్ల మిరియాలను భారతీయ వంటలలో విరివిగా వాడుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్,

Black Pepper : మిరియాల ఘాటు ఆరోగ్యానికి మంచిదే..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన మార్గం..
Black Pepper
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2021 | 7:21 AM

Black Pepper : నల్ల మిరియాలను భారతీయ వంటలలో విరివిగా వాడుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అంటు వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాపపడుతుంది. ఎలాంటి గాయాలకైనా, నొప్పులకైనా, వాపును తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుందని తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు దీన్ని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. టమోటా సూప్ టొమాటో సూప్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ ఫ్రీ రాడికల్ యాక్టివిటీ, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. టొమాటో సూప్‌లో మీరు కొద్దిగా మిరియాలు జోడించాలి. రోజూ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ సూప్ చేయడానికి కావలసినవి 2 – 3 మీడియం టమోటాలు, 1 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి, 3-4 వెల్లుల్లి మొగ్గలు, ½ అంగుళాల అల్లం, 25 గ్రాముల ఉల్లిపాయ, ఒక టీస్పూన్ నూనె రుచికి సరిపడ ఉప్పు. దీన్ని తయారు చేయడానికి మొదట టమోటాలు, వెల్లుల్లి, అల్లం, నల్ల మిరియాలు వేసి మరిగించాలి తరువాత చల్లబరచాలి. తర్వాత గ్రైండర్లో రుబ్బుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయను వేయించి దానికి పేస్ట్ జోడించండి. ఉడికించిన తర్వాత బాగా ఉప్పు కలపండి.

2. నల్ల మిరియాల టీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, బరువు తగ్గించడానికి మీరు ప్రతి ఉదయం నల్ల మిరియాల టీ తాగవచ్చు. ఈ టీ చేయడానికి మీకు గ్రౌండ్ నల్ల మిరియాలు, నిమ్మరసం, తరిగిన అల్లం అవసరం. తరువాత రెండు కప్పుల నీరు ఉడకబెట్టి 4-5 నల్ల మిరియాలు, 1 నిమ్మరసం, తాజాగా తరిగిన అల్లం జోడించండి. ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. టీ వడకట్టి తాగండి.

3. బ్లాక్ పెప్పర్ బ్రూ నల్ల మిరియాల కషాయాలు సీజన్ మారినప్పుడు చక్కగా పనిచేస్తాయి. కాలానుగుణ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా ఇది మంచిది. మీరు1 అంగుళాల అల్లం, 4-5 లవంగాలు, 5-6 నల్ల మిరియాలు, 5-6 తాజా తులసి ఆకులు, 1/2 టీస్పూన్ తేనె, 2 అంగుళాల దాల్చినచెక్క తీసుకోవాలి. దీన్ని తయారు చేయడానికి ఒక కప్పు నీరు ఉడకబెట్టి గ్రౌండ్ అల్లం, లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క జోడించండి. నీరు మరిగిన తరువాత తులసి ఆకులను జోడించండి. ఇది 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత ఫిల్టర్ చేయండి. ఈ మిశ్రమం రుచిని పెంచడానికి తేనె కలపండి.

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..

Fact Check: పసుపు, రాతి ఉప్పు, పటిక, ఆవ నూనెతో బ్లాక్ ఫంగస్ పారిపోతుందా?.. అసలు వాస్తవం ఏంటి..?

Etela : ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు హైకోర్టులో చుక్కెదురు, జమున హేచరీస్ భూముల్లో సర్వే నిలుపుదలకు ధర్మాసనం నో