Psychology: మీ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంటుందా? అయితే మీ వ్యక్తిత్వం ఇలాంటిదన్నమాట..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ముక్కు ఆకారం, కాలి ఆకారం, నడక, మాట తీరు, డ్రెస్సింగ్ వంటి అనేక పద్ధతుల ద్వారా మనం ఇతరుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అంతే కాదు మొబైల్‌ను పట్టుకునే విధానం ద్వారా క్యారెక్టర్ చెప్పేస్తుంది. తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచే అలవాటు ఉన్న వారి వ్యక్తిత్వాన్ని కూడా..

ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి అనేక వ్యక్తిత్వ పరీక్షలు ఉన్నాయి. అందులో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ముక్కు ఆకారం, కాలి ఆకారం, నడక, మాట తీరు, డ్రెస్సింగ్ వంటి అనేక పద్ధతుల ద్వారా మనం ఇతరుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అంతే కాదు మొబైల్‌ను పట్టుకునే విధానం ద్వారా క్యారెక్టర్ చెప్పేస్తుంది. తెలుసుకోవచ్చు. అయితే మొబైల్ ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచే అలవాటు ఉన్న వారి వ్యక్తిత్వాన్ని కూడా పరీక్షించుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? మొబైల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ సైలెంట్ మోడ్‌లో ఉంచే అలవాటు మీకు ఉందా? అయితే మీ వ్యక్తిత్వం మీరు ఎలాంటి వ్యక్తో మేం చెప్పేస్తాం..
మొబైల్ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టే వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
కొంతమంది తమ ఫోన్‌లను ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంచుతారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం, ఇలాంటి వ్యక్తులు ఇంట్రావర్ట్స్. ఫోన్‌ను ఎల్లప్పుడూ సైలెంట్ మోడ్‌లో ఉంచితే మీరు అంతర్ముఖుడు అని అర్థం. వీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు.
పనికి ప్రాముఖ్యత ఇస్తారు
మొబైల్ ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లో ఉంచుకునే వ్యక్తులు ఎల్లప్పుడూ తమ పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వీరు పనివేళల్లో తమ ఫోన్‌లను ఎప్పుడూ ఉపయోగించరు. సమయపాలన పాటించేవారు, నిజాయితీపరులన్నమాట.
భావోద్వేగపరంగా బలంగా ఉంటారు
ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచేవారు.. భావోద్వేగపరంగా చాలా బలంగా ఉన్నారని అర్థం. మీరు డిజిటల్ ప్రపంచం కంటే నిజ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వీరు మొబైల్‌లో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడరు.
ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు
మొబైల్ ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లో ఉంచే వ్యక్తులు ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వారు తమ సొంత ప్రపంచంలో మునిగిపోతారు. అంతే కాకుండా, మొబైల్ నోటిఫికేషన్ శబ్దాలు మానసిక ఒత్తిడి, చిరాకును కలిగిస్తాయి. అందుకే మానసిక ప్రశాంతత కోసం మొబైల్ ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లో ఉంచుతారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.








