Parenting: పిల్లలను పదే పదే తిడుతున్నారా? భవిష్యత్‌లో ఈ సమస్యలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త..

కొంతమంది పిల్లలు తమ మనుసులోని భావాలను, తాము అనుకున్న విషయాలను సులభంగా వ్యక్తం చేయలేరు. దీనికి ప్రధాన కారణం బాల్యంలోని పెంపకం విధానం.

Parenting: పిల్లలను పదే పదే తిడుతున్నారా? భవిష్యత్‌లో ఈ సమస్యలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త..
Parenting Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 28, 2022 | 6:27 PM

కొంతమంది పిల్లలు తమ మనుసులోని భావాలను, తాము అనుకున్న విషయాలను సులభంగా వ్యక్తం చేయలేరు. దీనికి ప్రధాన కారణం బాల్యంలోని పెంపకం విధానం. పిల్లలతో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించడం. దీని కారణంగా పిల్లలు తమ సమస్యలను పంచుకోవడం మానేయడమే కాకుండా, వారిలో వారే కుమిలిపోతుంటారు. తల్లిదండ్రులకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇది క్రమంగా వారు ఆత్మన్యూనతా భావంలోకి వెళ్లిపోతారు. వారి వ్యక్తిత్వ వికాసంపైనా ప్రభావం చూపుతుంది.

ఓ సంస్థ అధ్యయనం ప్రకారం.. తల్లిదండ్రులు తమ పిల్లలను తరచుగా దండించడం, తిట్టడం వలన ఒకరకమైన భావనలోకి వెళ్లిపోతారు. పిల్లలు నిరుత్సాహానికి గురవుతారు. విచారంగా, కోపంగా, మూడీగా ఉంటారు. పిల్లలు అల్లరి చేస్తున్నారని తిట్టడం, దండించడం చేస్తే.. వారు భయంతో నిశ్శబ్దంగా ఉంటారు. అయితే, అది జీవితంపైనా ప్రభావం చూపుతుంది. వారు మాట్లాడటమే తగ్గిస్తారు. అయితే, పెద్దవాళ్లలా పిల్లలు తమ భావోద్వేగాలను పూర్తిగా అదుపు చేసుకోలేరు. ఫలితంగా వారు వింతగా ప్రవర్తిస్తారు. ప్రమాదకరంగా మారుతారు. ముఖ్యమైన విషయాలను వ్యక్తపరచడం కూడా మానేస్తారు. మీ పిల్లలు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతున్నట్లయితే.. వారి వ్యక్తిత్వ వికాసం కోసం, వారు తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఎలా సహకారం అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లల భావాన్ని అంగీకరించండి..

కొన్నిసార్లు పిల్లలు మీకు నచ్చని విధంగా ప్రవర్తించవచ్చు. ఇలాంటి సందర్భంలో వారిపై విసుక్కోకుండా వారి భావాలను యాక్సెప్ట్ చేయాలి. పిల్లలకు సాయం చేయడానికి ప్రయత్నించాలి. వారు చెప్పేది మీరు శాంతంగా వింటే.. మీరు వారి భావాన్ని అర్థం చేసుకున్నారని భావించి ప్రశాంతంగా ఉంటారు. మరోసారి తమ అభిప్రాయాన్ని ప్రశాంతంగా వ్యక్తపరుస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రశాంతంగా కూర్చొని పిల్లల భావాలను వినాలి..

మీ పిల్లలు తమ సమస్యలను మరింత మెరుగ్గా చెప్పుకునేలా ప్రోత్సాహం అందించాలి. వారు చెప్పేది అంతా ప్రశాంతంగా వినాలి. అలా చేయడం వల్ల పిల్లల్లో ఒక విశ్వాసం ఏర్పడుతుంది. పిల్లలు తాము చెప్పాలనుకున్నది తల్లిదండ్రులకు చెప్పినప్పుడు.. ఆ తల్లిదండ్రులు వారి సమస్యను సావదానంగా వింటే వారిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వారిలో రెట్టింపు అవుతుంది.

పదాలను నేర్పించాలి..

పిల్లలకు వారి భావాలను వ్యక్తపరచగల సామర్థ్యాన్ని పెంపొందించడంలో తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి. వారికి మాటలను, పదాలను నేర్పించాలి. ఉదాహరణకు పిల్లలకు ఏదైనా సమస్య ఉంటే, అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఇవాళ నాకు అనారోగ్యంగా ఉందని చెప్పగలిగేలా పదాలను నేర్పించాలి. పిల్లలకు మాటలను సానుకూల దృక్పథంలో నేర్పించాలి.

సమస్యకు పరిష్కారం చూపేలా సహాయం చేయాలి..

పిల్లలకు తమ భావాలను పంచుకోవడానికి వివిధ మార్గాలను చెప్పవచ్చు. అయితే, భావోద్వేగాలను పంచుకోవడంతో పరిష్కార మార్గాలను కనుగొనేలా కూడా వారికి ప్రోత్సాహం అందించాలి.

సంతోషాన్ని పంచాలి..

పిల్లలు తమ భావాలను మంచి మార్గంలో పంచుకుంటే వారిని ప్రేమతో అభినందించాలి. వారిని సంతోషంగా ఉంచాలి. వారిపై చిరాకు పడొద్దు.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు పిల్లల మానసిక నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..