Palmistry: మీ అరచేతిలో M అక్షరం ఇలా ఉందా.. వీరు వ్యక్త్విత్వం, లక్షణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ప్రతి ఒక్కరికీ తమ జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏమి జరుగుతుందని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఇందుకోసం చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మితే.. మరికొందరు సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు. మరికొందరు హస్తసాముద్రికానని నమ్ముతారు. తమ చేతుల్లోని రేఖల ద్వారా రానున్న కాలంలో తమ జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటారు. అరచేతిలోని రేఖలను నిశితంగా పరిశీలిస్తే రకరకాల అక్షరాలు కనిపిస్తాయి. అలా మీ చేతిలో M గుర్తు ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

జీవితంలో పెళ్లి, ఉద్యోగం, సంతానం వంటి విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది జ్యోతిష్య శాస్త్రాన్ని బదులుగా తమ చేతి రేఖల ద్వార భవిష్యత్ ని తెలిపే హస్తసాముద్రికాన్ని విశ్వసిస్తారు. అంటే చేతిలో ఉన్న రేఖల ఆధారంగా భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకుంటారు. మీ అరచేతుల్లో ఉన్న రేఖలని నిశితంగా పరిశీలిస్తే కొన్ని సంకేతాలు , అంగ్ల అక్షరాలు కనిపిస్తాయి. మీ చేతుల్లోని గీతల్లో M ఆకారంలో ఉన్న ఒక గుర్తు ఉందో లేదో ఒక్కసారి పరిశీలించండి. అరచేతిలో M అక్షరం అర్ధం ఏమిటో తెలుసుకుందాం..
మీ అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే.. నిజంగా అది ప్రత్యేకమైన విషయం. ఎందుకంటే M అక్షరం చాలా అరుదుగా కనిపిస్తుంది. M అక్షరం ఉన్నవారు చాలా అదృష్టవంతులు అని భావించవచ్చు. ఎందుకంటే ఈ M అక్షరం కొన్ని ప్రత్యేక లక్షణాలను సూచిస్తుంది. అరచేతిలో ఉన్న M అక్షరం డబ్బు , ప్రేమలో అదృష్టాన్ని సూచిస్తుంది.
M అక్షరం అర్థం:
సామర్థ్యం: M అక్షరం గొప్ప సామర్థ్యం , తెలివితేటలు ఉన్నాయని సూచిస్తుంది. వీరు ఏదైనా చేయగలరు.. తమకంటూ ఓ లక్షాన్ని నిర్దేశించుకుని దానిని సాధించగలరు.
ఆత్మవిశ్వాసం: వీరు మంచి ఆత్మవిశ్వాసం, దృఢమైన మనస్సు ఉన్నారని సూచిస్తుంది. అంతేకాదు వీరు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటారు.
విజయాలు: M అక్షరం ఉంటే జీవితంలో పెద్ద విజయాలు, కీర్తిని సాధించే అవకాశం ఉందని సూచిస్తుంది.
సామాజికంగా M అక్షరం ఉన్నవారు సామాజికంగా చురుకుగా ఉంటారని.. ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారని సూచిస్తుంది. వీరు మంచి స్నేహితులు, అంతేకాదు మంచి జీవిత భాగస్వాములు.
సృజనాత్మకత: M అక్షరం ఉన్నవారు మంచి సృజనాత్మకత, మంచి ప్రతిభ గలవారని సూచిస్తుంది. కళ, సంగీతం లేదా సాహిత్యం వంటి రంగాల్లో విజయం సాధించవచ్చు.
అయితే .. చేతిలో M అక్షరం ఉన్న చోటు ఆధారంగా కూడా దీని అర్థం మారవచ్చు.
ఈ M అక్షరం ఉన్నవారు ఉన్నత మనస్తత్వం కలిగి ఉంటారు. కోరుకున్నది సాధించే వరకూ పట్టుదల వలరు. వీరు విజయాన్ని సాధిస్తారు. 40 ఏళ్ళు వచ్చే సరికి సమాజంలో కీర్తి , ప్రతిష్టని పొందుతారు. డబ్బును బాగా సంపాదిస్తారు.
వీరు ఉత్సాహంగా, కరుణతో ఉంటారు. అంతేకాదు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంటారు. ఏదైనా పని అప్పగిస్తే.. విజయవంతంగా పూర్తి చేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








