Nitha Ambani: అరవైల్లోనూ ఇరవైలా కనిపించాలా ఇలా చేయండి.. ఫిట్ నెస్ సీక్రెట్ రివీల్ చేసిన నీతా అంబానీ..
మహిళలు 30 ఏళ్ల తర్వాత దశాబ్దానికి 3-8% మజిల్ ను కోల్పోతారు. మన వయసు పెరిగే కొద్దీ ఇది వేగవంతం అవుతుంది. మన కండరాలు, ఎముకల సాంద్రత, సమతుల్యతతో పాటు బలం కూడా తగ్గుతుంది. మన జీవక్రియ నెమ్మదిస్తుంది ఈ కారణంగానే మహిళలు తొందరగా అనారోగ్యం బారిన పడుతుంటారు అని నీతా అంబానీ తెలిపారు. మహిళలు ఎంత వయసొచ్చినా అదే ఫిట్ నెస్ ఎలా మెయింటైన్ చేయాలో ఆమె కొన్ని టిప్స్ ను కూడా పంచుకున్నారు.

ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ తన ఆహారం, ఫిట్‌నెస్ దినచర్యను పంచుకున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ అంబానీ మహిళలు ఫిట్‌గా ఉండాల్సిన అవసరాన్ని ఇందులో పేర్నొన్నారు. 61 ఏళ్ల వయసులోనూ తాను ఇంత ఫిట్ గా ఎలా ఉందో చెప్తూ ఓ వీడియోను పోస్ట్ చేయగా అది వైరలైంది. మరి అంతలా ఈ వీడియోలో ఈ సెలబ్రిటీ పోస్ట్ చేసిన విషయాలేంటో మీరూ తెలుసుకోండి..
నీతా అంబానీ ఫిట్‌నెస్ దినచర్య
తాను వారానికి 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేస్తానని నీతా అంబానీ తెలిపారు. ఆమె 6 ఏళ్ల నుంచే భరత నాట్యం చేస్తుండటం కూడా తన ఫిట్ నెస్ కు మరో కారణమని తెలిపింది. అందుకే తన కాళ్లు ఇంకా ఎంతో బలంగా ఉంటాయంది. తన శరీరంలో ప్రతి భాగాన్ని కదిలిస్తూ చేసే వ్యాయామాలు ఎంతో ఇష్టపడతానని పేర్కొంది. ఆమె దినచర్యలో స్విమ్మింగ్, ఆక్వా వ్యాయామాలు, డ్యాన్స్ కూడా ఉంటాయట. ఆమె ఆరోగ్యానికి ప్రాధాన్యత ప్రకారం. రోజుకు 5,000-7,000 అడుగుల నడక ఉండేలా చూసుకుంటుందట.
ఇదే ఫుడ్ సీక్రెట్..
తన ఆహారం గురించి చెప్తూ అంబానీ తాను శాఖాహారినని, సేంద్రీయ, ప్రకృతి ఆధారిత ఆహారాన్ని ఇష్టపడతానని చెప్పారు. ఆమె మాట్లాడుతూ, “నా ఆహారం సమతుల్యమైనది. నేను శాఖాహారిని. నా ఆహారం మరింత సేంద్రీయ మరియు ప్రకృతి ఆధారితమైనది. ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం, చక్కరను తీపిని కలుగజేసే వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తానని తెలిపారు.
వీడియో చివర్లో నీతా అంబానీ మాట్లాడుతూ.. తాను వ్యాయామం చేసినప్పుడు ఎంతో ప్రశాంతతను పొందుతానని, అది తనను రోజంతా పాజిటివ్ గా ఉంచుతుందని తెలిపారు. ఇది ఒత్తిడిని తగ్గించే సంతోషకరమైన హార్మోన్లు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. బరువులు ఎత్తడం గురించి మాత్రమే కాదు మన దైనందిన జీవితాన్ని ఎదుర్కోవడానికి శక్తి, ఓర్పును కలిగి ఉండటం కూడా ముఖ్యం. నాకు ఇది నా మనవరాళ్లను ఎత్తడం, వారితో పోటీపడటం లాంటిది. ఇది వయస్సుతో పోరాడటం గురించి కాదు కానీ ఆ ఫిట్ నెస్ ను సొంతం చేసుకోవడం గురించి. నేను 61 ఏళ్ల వయసులో కూడా దీన్ని చేయగలిగితే, మీరు కూడా చేయగలరు. అందుకే సమయం కేటాయించండి. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోండి. రోజుకు 30 నిమిషాలు, వారానికి నాలుగు సార్లు వ్యాయామానికి కేటాయించండి అంటూ నీతా అంబానీ పిలుపునిచ్చింది.