Medicinal Plant: మన ఇంట్లోనే ఉన్నా అస్సలు పట్టించుకోరు.. ఎన్నో సమస్యలకు అద్భుత సంజీవని..
ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా నేల ఉసిరి (భూమి ఆమ్లా)ని పేర్కొంటారు. ఇది పచ్చకామెర్లు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు, మలబద్ధక సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం అందిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సహజ సిద్ధంగా లభించే ఈ మొక్క అనేక రోగాలను దూరం చేస్తుంది.

మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలుంటాయి. వాటిల్లో కొన్నింటి గురించే మనకు తెలుసు. మనకు తెలియని ఎన్నో సహజసిద్ధమైన, విలువైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. ఆ ఔషధాలు అనేక రకాల అనారోగ్యాలను దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలా.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాలలో నేల ఉసిరి ఒకటి.. ఇది మన ఇళ్లల్లోనే ఉంటుంది.. కానీ.. ఎవ్వరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు.. సాధారణంగా నేల నానుకొని, సుమారు ఒక అడుగు ఎత్తుకు మించకుండా పెరిగే ఈ మొక్క.. దీని ఆకులూ, కాయలు ఉసిరికాయలను పోలి ఉంటాయి. అందుకే దీనిని “నేల ఉసిరి” అని పిలుస్తారు. సంస్కృతంలో దీనిని “భూమి ఆమ్లా” అని, అధిక ఆకులు, కాయలు ఉండటం వలన “బహుపత్ర”, “బహుఫల” అని కూడా పిలుస్తారు. ఈ మొక్క దాదాపు సంవత్సరం పొడవునా, అన్ని ప్రాంతాలలో లభిస్తుంది.
నేల ఉసిరిపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. అనేక వ్యాధులకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని, ముఖ్యంగా కొన్ని రకాల వైరస్ వ్యాధులను తగ్గించడంలో దీనికి సాటిలేదని నిరూపించబడింది. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వైరస్ల వల్ల కలిగే పచ్చకామెర్లు, హెర్పస్, హెచ్‌ఐవి వంటి వైరల్ సమస్యలకు ఇది అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కామెర్లకు నేల ఉసిరి..
పచ్చకామెర్ల వ్యాధిని తగ్గించడంలో, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నేల ఉసిరి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని బిల్లురుబిన్ స్థాయిలను వేగంగా తగ్గించి, కాలేయాన్ని బలపరిచి, వైరస్లను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది.
చర్మ సమస్యలు దూరం..
చర్మ వ్యాధులు దివ్యౌషధం నేల ఉసిరి.. గజ్జి, తామర, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలకు నేల ఉసిరి బాహ్య లేపనంగా అద్భుతంగా పనిచేస్తుంది.
మలబద్దకం నుంచి ఉపశమనం..
నేల ఉసిరి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. నేల ఉసిరి దీనికి సులభమైన, ఖర్చులేని పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి.. ఇది ప్రేగుల కదలికలను మెరుగుపరిచి, సులువుగా మల విసర్జన జరిగేలా చేస్తుంది.
నేల ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి.. చర్మం శుభ్రంగా మారి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పరోక్షంగా గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలు, మెదడుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఇది సహాయపడుతుంది. సాధారణంగా మోషన్ అయ్యేవారు కూడా రక్తశుద్ధికి దీనిని వాడుకోవచ్చు.
ఈ విధంగా నేల ఉసిరిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు లేకుండా, సమర్థవంతంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అయితే.. దీనిని రసంగా లేదా.. పెరుగు, బెల్లం లాంటి మిశ్రమాలలో కలిపి తీసుకోవాలి.. ఇంకా నేల ఉసిరి పొడిని కూడా నీటిలో కలిపి తీసుకోవచ్చు..
అయితే.. ఏమైనా సమస్యలున్నా.. లేకున్నా.. ఉపయోగించే ముందు వైద్య నిపుణులను, అలాగే ఆయుర్వేద నిపుణులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం..
ఇది కూడా చదవండి: బలానికి బలం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మటన్‌లోని ఈ పార్ట్ తింటే ఇక తిరుగుండదంతే..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
