సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
Keep phone germ free: రోజంతా చేతిలో ఉండే ఫోన్‌పై వేల సంఖ్యలో కరోనావైరస్ లాంటి హానికరమై సూక్ష్మక్రిములు(Germs) చేరుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్, కిచెన్, బయట ప్రదేశాలు.. ఎక్కడికెళ్లినా ఫోన్ వెంటనే ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మరి సెల్‌ఫోన్‌ను సురక్షితంగా, జర్మ్‌ఫ్రీగా ఎలా శుభ్రం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అనేది మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నప్పటికీ.. దానిని శుభ్రంగా ఉంచుకోకపోతే మాత్రం మనకు ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. రోజంతా చేతిలో ఉండే ఫోన్‌పై వేల సంఖ్యలో కరోనావైరస్ లాంటి హానికరమై సూక్ష్మక్రిములు(Germs) చేరుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్, కిచెన్, బయట ప్రదేశాలు.. ఎక్కడికెళ్లినా ఫోన్ వెంటనే ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మరి సెల్‌ఫోన్‌ను సురక్షితంగా, జర్మ్‌ఫ్రీగా ఎలా శుభ్రం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి
ఫోన్ శుభ్రం చేసే ముందు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలి. ఛార్జింగ్‌కు పెట్టి ఉన్నట్లయితే ప్లగ్ తీసేయాలి. ఇది భద్రతకు చాలా ముఖ్యం.
2. మైక్రోఫైబర్ క్లాత్ ఉపయోగించండి
సాధారణ గుడ్డ లేదా రఫ్ క్లాత్ వాడితే స్క్రీన్‌పై గీతలు పడే ప్రమాదం ఉంటుంది. కళ్లజోడు తుడిచే మైక్రోఫైబర్ క్లాత్‌తో నెమ్మదిగా తుడవాలి.
3. ఆల్కహాల్ ద్రావణం జాగ్రత్తగా వాడండి
70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉన్న ద్రావణాన్ని కొద్దిగా క్లాత్‌పై వేసి స్క్రీన్‌ను తుడవాలి. నేరుగా ఫోన్‌పై ద్రావణం పోయకూడదు. ఇలా చేస్తే ఫోన్ చెడిపోయే ప్రమాదం ఉంది.
4. పోర్ట్స్, స్పీకర్ గ్రిల్స్ జాగ్రత్త
చార్జింగ్ పోర్ట్, ఇయర్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్స్‌లో నీరు లేదా ద్రావణం పోకుండా చూసుకోవాలి. అవసరమైతే డ్రై బ్రష్ లేదా టూత్‌పిక్‌తో దుమ్ము తీసేయాలి.
5. ఫోన్ కవర్‌ను కూడా శుభ్రం చేయండి
ఫోన్ కవర్‌లోనే ఎక్కువ మురికి, బ్యాక్టీరియా చేరుతాయి. కవర్‌ను తీసి సబ్బు నీటితో కడిగి పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ పెట్టాలి.
6. రోజుకు ఒక్కసారైనా శుభ్రం చేయాలి
ప్రతిరోజూ కనీసం ఒక్కసారి మీ ఫోన్‌ను తుడవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌ను శుభ్రం చేయడం మంచిది.
7. ఈ తప్పులు మాత్రం చేయకండి
నీటిలో ఫోన్ ముంచడం, హార్ష్ కెమికల్స్ వాడడం, టిష్యూ పేపర్ లేదా రఫ్ క్లాత్‌తో రుద్దడం, ఇవి ఫోన్‌కు నష్టం కలిగించవచ్చు.
ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?
చేతులు శుభ్రం చేసుకున్నా, ఫోన్ మురికిగా ఉంటే మళ్లీ జర్మ్స్ చేతులకు చేరుతాయి. కాబట్టి చేతులతో పాటు ఫోన్ శుభ్రత కూడా తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ సెల్‌ఫోన్‌ను జర్మ్‌ఫ్రీగా ఉంచుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
