కరెంట్ తీగలపై పక్షలు.. షాక్ ఎందుకు కొట్టదో తెలుసా?

Samatha

20 January 2026

కరెంట్ అంటే భయం ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ విద్యుత్‌కు భయపడి,  దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రాణలకే ప్రమాదకరం కాబట్టి.

కరెంట్

అయితే మనం రోడ్లపై కరెంట్ స్తంభాలు, వాటికి వేలాడే పెద్ద పెద్ద వైర్లను చూస్తుంటాం. అయితే వాటిని ముట్టుకుంటే షాక్ వస్తుంది. కానీ పక్షలు వాటిపై కూర్చొన్న వాటికి ఏం కాదు.

కరెంట్ స్థంభాలు

మరి  మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కరెంట్ తీగలపై కూర్చొన్న కూడా పక్షులకు ఎందుకు కరెంట్ షాక్ రాదు? దీని గల కారణం ఏంటో, ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

పక్షులకు కరెంట్

విద్యుత్ అనేది చాలా డేంజర్, అయితే ఇది ప్రవహించాలి అంటే, పూర్తి సర్క్యూట్ అనేది అవసరం. ఇది ఎప్పుడూ కూడా ఎక్కువ వోల్టేజ్ ఉన్న స్థానం నుంచి, తక్కవ వోల్టేజ్ స్థానం ఉన్న భూమి వైపు ప్రవహిస్తుంది.

విద్యుత్ సరఫరా

ఇక కరెంట్ షాక్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే? ఒక వ్యక్తి లేదా జీవి శరీరంలోకి ప్రవేశించి, మరో చోట నుంచి బయటకు వెళ్లాలి అప్పుడే కరెంట్ షాక్ తగులుతుంది.

కరెంట్ షాక్ ఎప్పుడు వస్తుందంటే

అయితే పక్షి కరెంట్ తీగపై ఉన్నప్పుడు ఒకే తీగపై రెండు కాళ్లు పెట్టి కూర్చొంటుంది. ఆ సమయంలో దాని రెండు కళ్లూ కూడా ఒకే వైరుపై ఉంటాయి.

రెండు కాళ్లు

పక్షి కాళ్లు ఒకే తీగపై ఉన్నప్పుడు దాని కాళ్ల మధ్య వోల్టేజ్ తేడా అనేది సున్నాగా ఉంటుంది. అందువలన పక్షి శరీరం గుండా కరెంట్ ప్రవహించదు, తద్వారా పక్షలకు కరెంట్ షాక్ తగలదు.

సున్నాగా ఉంటుంది

ఒక వేళ పక్షి ఈకలు లేదా, దాని తోక గనుక వేరే కరెంట్ తీగకు తగిలినప్పుడు మాత్రం తప్పకుండా కరెంట్ షాక్ అనేది తగులుతుందంట.

పక్షి ఈకలు వేరే వైరుకు తగలడం