వీరు రేగు పండ్లు తినడం ప్రమాదకరం.. తిన్నారో ఆసుపత్రికే !
Samatha
20 January 2026
రేగు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వైద్య నిపుణులు కూడా తప్పకుండా ఆపిల్ బేర్ తినాలంటారు.
ఆరోగ్యానికి మంచిది
అయితే ఆపిల్ బేర్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది దీనిని తినడం మాత్రం అస్సలే మంచిది కాదంట, దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్యులు.
కొందరికి ప్రమాదకరం
డయాబెటీస్ సమస్యలతో బాధపడే వారు రేగు పండ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే? ఇది కొన్ని సార్లు చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతుంది.
డయాబెటీస్
జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా ఆపిల్ బేర్ తినకూడదంట. ఇది గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుందంట.
జీర్ణ సమస్యలు
అదే విధంగా కొంత మంది ఆపిల్ బేర్ పండ్లను తిన్న తర్వాత అలర్జీ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అందువలన చర్మ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినకూడదంట.
చర్మ సమస్యలు
గర్భిణీలు రేగు పండ్లను అతిగా తినడం మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జీవక్రియ, జీర్ణ క్రియ వంటి వాటిపై దాని ప్రభావం చూపుతుంది.
గర్భిణీలు
అలాగే ఆస్తమా వంటి శ్వాస కోశ వ్యాధులతో బాధపడే వారు కూడా రేగు పండ్లు తినడం మంచిది కాదంట. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది
శ్వాస కోశ సమస్యలు
దగ్గు, జలుబు, తలనొప్పి వంటి సమస్యలతో నిరంతరం బాధపడేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో రేగు పండ్లను తినకూడదంట.