మేడారంలో ధరలు చూస్తే గుండె దడ ఖాయం..ఇవి మర్చిపోయారో.. పర్సు ఖాళీనే!
Samatha
20 January 2026
తెలంగాణ కుంభమేళ మొదలైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. ఈ పండుగకు చాలా మంది భక్తులు తరలి వెళ్తున్నారు.
తెలంగాణ కుంభమేళ
అయితే మేడారం వెళ్లే వారికి బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే? అక్కడ కొన్ని వస్తువుల ధరలు చేస్తే , షాక్ అయిపోవాల్సిందే.
బిగ్ అలర్ట్
సామాన్యులు ఇంటి నుంచి ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్లడం మర్చిపోతే పర్సు ఖాళీ అవ్వడం ఖాయం. కాగా, ఏ వస్తువుల ధరలు ఎంతో చూద్దాం.
సామాన్యులు
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది మేడారంలోని వన దేవతలను దర్శించుకోవాలి అనుకుంటారు. ఎంత కష్టమై సరే మేడారం బయల్దేరుతారు.
చిన్నవారు, వృద్ధులు
అయితే అక్కడ అనారోగ్య సమస్యలు, వృద్ధులు, చిన్నపిల్లలు చన్నీటితో కాకుండా వేడి నీటితో స్నానం చేయాలి అనుకుంటే, బకెట్ వేడీ నీరు రూ. 50 అంట.
వేడి నీళ్లు
అలాగే కొబ్బరికాయలు మర్చిపోతే మాత్రం ఆ ధరలు చూసి చుక్కలు చూడాల్సిందేనంట. దాదాపు ఒక కొబ్బరి కాయ ధర రూ. 80 నుంచి మొదలైదంట. ఇక అక్కడ కోడి ధర ఏకంగా రూ. 800 ఉన్నట్లు సమాచారం.
కొబ్బరి
రూమ్‌లు అద్దెకు తీసుకొని ఉండాలి అనుకుంటే మాత్రం.ఏసీ, గదులకు రూ. 5000ల నుంచి 3000 , 4000ల వరకు వసూలు చేస్తున్నారంట. మేకలు, గొర్రెలకు ఏకంగా 6 వేల పైనే ఉన్నదంట.
రూమ్స్
ఇక మేడారం వెళ్లే క్రమంలో వంట చేసుకోవడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి టెంట్‌లు కనిపిస్తాయి. అలాగే, చిన్న చిన్న టెంట్‌లు అద్దెకు ఇస్తారు, మీరు వీటిని తీసుకోవాలి అనుకుంటే, ఒక్కదానికి రూ. 500 నుంచి మొదలై 1000 వరకు ఉన్నాయంట.