బాబోయ్ వీళ్లకు లవంగం వెరీ డేంజర్..!

21  January 2026

Jyothi Gadda

చాలా మందికి లవంగాలు తినే అలవాటు ఉంటుంది. లవంగాలు నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్ గా పని చేస్తాయి. పైగా జీర్ణ శక్తిని పెంచుతాయి. 

ఆయుర్వేదంలో లవంగాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రుచిలోనే కాకుండా వంటకు కొత్త ఫ్లేవర్ అందించడంలోనూ ఇవి ఎంతగానో తోడ్పడతాయి. 

లవంగాలు తినటం వల్ల కొన్ని సార్లు శరీరంలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ జరిగి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. వీటిలోని యుగెనాల్ టాక్సిక్ గా ఉంటుంది.

ఇప్పటికే లివర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు వీలైనంత వరకూ లవంగాల నూనెను, లవంగాలను అవాయిడ్ చేయడమే మంచిది.

అజీర్తి కోసం లవంగాలు తినడం మంచిదే కావచ్చు. కానీ డయాబెటిస్ ఉన్న వారు మాత్రం పొరపాటున కూడా లవంగాలు తినకూడదని చెబుతున్నారు.

గర్భిణీలతో పాటు పాలిచ్చే తల్లులు కూడా వీలైనంత వరకూ లవంగాలను అవాయిడ్ చేయడమే మంచిదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

అలెర్జీ ఉన్నవారు అస్సలు తినకూడదు. లవంగాలు అంటే పడని వారు..అంటే అలెర్జిక్ రియాక్షన్స్ వచ్చే వాళ్లు వీలైనంత వరకూ దూరంగా ఉండాలి.

చిగుళ్ల నుంచి రక్తం రావడం, నోటి అల్సర్ లాంటి సమస్యలున్నప్పుడూ లవంగాలు కలిసి ఉన్న ఉత్పత్తులు వాడడం మంచిది కాదు.

ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు లవంగాలు ఎక్కువగా తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.