Almonds: రోజుకు ఎన్ని బాదం పలుకులు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో తెలుసా?
బాదం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అందుకే బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందని తరచూ నిపుణులు చెబుతుంటారు. పోషకాల నిధి అయిన బాదంపప్పును చాలా మంది ప్రతిరోజూ తింటుంటారు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే..

బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. పోషకాల నిధి అయిన బాదంపప్పును చాలా మంది ప్రతిరోజూ తింటుంటారు. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందొచ్చు. అందుకే బాదంకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్ ఉంటుంది. శక్తివంతమైన పోషకాలు కలిగిన బాదం పప్పులకు కూడా చరిత్రలో ఒకరోజు కేటాయించారు పెద్దలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి16వ తేదీని బాదం దినోత్సవాన్ని జరుపుకుంటారు.
సాధారణంగా వివిధ రుచికరమైన డెజర్ట్‌లలో బాదంపప్పులను ఉపయోగిస్తుంటారు. బాదం చెట్టు మధ్యప్రాచ్యం, దక్షిణాసియాకు చెందిన మొక్క. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు సమానంగా పెరిగే చెట్టు. ప్రపంచంలో పండే బాదం పప్పులో 80 శాతం అమెరికాలోని కాలిఫోర్నియాలో పండుతాయి.
రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 30 నుంచి 50 గ్రాముల వరకు బాదం తింటే సరిపోతుంది. అంటే మీరు ఒక పిడికిలి లేదా 8 నుంచి 10 బాదంపప్పులు తినవచ్చు. 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రోజుకు 3 నుంచి 4 బాదంపప్పులు తినిపించవచ్చు. ముఖ్యంగా నానబెట్టిన బాదంపప్పు తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా 50 గ్రాముల బాదం పప్పులో దాదాపు 300 కేలరీలు, 150 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి.
బాదం తినడానికి సరైన సమయం ఏది?
బాదం తినడానికి సరైన సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా బాదం తినవచ్చు. కానీ దాని పూర్తి ప్రయోజనాలను పొందాలంటే ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినమని వైద్యులు సలహా ఇస్తారు. బాదం పప్పులు కాస్త వేడి స్వభావం కలిగి ఉండటం వల్ల, వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








