AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Leaves: మునగాకు ఆరోగ్యానికి అమృతమే.. ఈ వ్యాధులున్నవారు తింటే విషంతో సమానం.. ఎందుకంటే

మనిషి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెరిగింది. తినే ఆహారంలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. ప్రకృతిలో లభించే ఆహారానికి తినడానికి అత్యధికంగా ప్రాముఖ్యత నిస్తున్నారు. అలాంటి పకృతి ప్రసాదిత వరం మునగాకు. ఆయుర్వేదం ప్రకారం మునగ ఆకులు ఆరోగ్యానికి అమృతం వంటివి. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు మునగాకుని తినడం వలన విషంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు ఏ వ్యాధుల వారు మునగాకు తినొద్దో తెలుసుకుందాం..

Moringa Leaves: మునగాకు ఆరోగ్యానికి అమృతమే.. ఈ వ్యాధులున్నవారు తింటే విషంతో సమానం.. ఎందుకంటే
Moringa Leaves Side Effects
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 12:01 PM

Share

ఆయుర్వేదాన్ని ఆశ్రయించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఎందుకంటే ఔషధాల దుష్ప్రభావాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదం సహాయం తీసుకుంటున్నారు. ఆయుర్వేద మూలికలను తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేద మూలికలలో మునగకాయలు, మునగ ఆకులను దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సగా ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ మొక్క అద్భుత చెట్టు. ఈ చెట్టు పోషకాల శక్తి కేంద్రం. దీని వినియోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వాస్తవానికి మునగ ఆకులు ఆరోగ్యానికి అమృతం లాంటివి. ఈ ఆకుల్లో శరీరానికి పోషణనిచ్చే యాంటీఆక్సిడెంట్ గుణాలతో సమృద్ధిగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్ , ఆమ్లత్వంతో బాధపడేవారు ఈ ఆకులను ప్రతిరోజూ తినడం వలన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విటమిన్ ఎ అధికంగా ఉండే మునగ ఆకులు కంటి చూపును పెంచుతాయి. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులను తినడం జ్ఞాపకశక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది.

ఈ ఆకులు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే ఈ ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి కొంత హాని కూడా కలుగుతుంది. ఈ ఆకులు విషం లా మారి కొంతమంది ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని వ్యాధులతో బాధపడేవారు పొరపాటున కూడా ఈ ఆకులను తినకూడదని ఆయుర్వేదం సూచిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను అస్సలు తినకూడదు. మునగ ఆకులను ఏ వ్యాధులలో తినకూడదో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

కాలేయ సమస్యలు ఉంటే కొవ్వు కాలేయం, కాలేయ వాపు, కాలేయ సిర్రోసిస్ లేదా ఏదైనా ఇతర కాలేయ సంబంధిత సమస్య ఉన్నవారు మునగ ఆకులను తినకూడదు. ఈ ఆకులు కాలేయ సంబంధిత సమస్యలను పెంచుతాయి. మునగ ఆకులకు విషాన్ని తొలగించే గుణం ఉంది. అయితే ఇప్పటికే బలహీనంగా ఉన్న కాలేయం.. శరీరంలోని విషాన్ని తొలగించే భారాన్ని భరించలేకపోతుంది. ఈ ఆకులను తినడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. కాలేయం పనితీరును ప్రభావితం చేస్తుంది. కాలేయం దెబ్బతింటుంది.

గుండె రోగులు గుండె జబ్బులు ఉన్నవారు మునగ తినవద్దు. ఈ ఆకులు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఇప్పటికే రక్తపోటును నియంత్రించడానికి మందులు తీసుకుంటుంటే.. వారు మునగాకు తినడం వలన రక్తపోటు చాలా తగ్గుతుంది. దీంతో తలతిరగడం, అలసట వంటి సమస్యలతో పాటు గుండె కొట్టుకోవడం తగ్గుతుంది.

గర్భధారణ సమయంలో గర్భధారణ సమయంలో మహిళలు మునగ ఆకులను తినకూడదు. ఈ ఆకులు తల్లి , బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో మునగను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది మహిళల్లో అజీర్ణం, విరేచనాలు లేదా గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. గర్భధారణ సమయంలో ఈ ఆకులను నివారించడం వల్ల శరీరానికి ప్రయోజనం చేకూరుతుంది.

డయాబెటిస్ రోగులు మధుమేహ వ్యాధిగ్రస్తులు మునగ ఆకులను తినకూడదు. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. దీంతో హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. మునగలో శరీరం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే సమ్మేళనాలు ఉన్నాయి. కనుక షుగర్ వ్యాధి నియంత్రణ కోసం మెడిసిన్ తీసుకునేవారు ఈ మునగాకులను తినడం వలన .. మధుమేహ బాధితుల్లో షుగర్ లెవెల్ వేగంగా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)