AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపిలో ప్రతి చోట యోగాసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వినూత్న ఆలోచనకు రూపం వచ్చింది. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లే ముందు ఖాళీ స్థలం ఉంది ఎంతో కాలంగా అక్కడ మట్టి పేరుకుపోయి ఉంది. అయితే ఎస్పీ సతీష్ కుమార్ అక్కడ అరుదైన శిల్పాక్రుతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు.

Andhra Pradesh: పోలీస్ ఆఫీస్ ఎదుట సూర్య నమస్కారాలు..ఆకట్టుకుంటున్న శిల్పాలు.. ఆవిష్కరించిన ఎస్పీ
Yogasanas 1
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 11:35 AM

Share

పోలీసులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ప్రతి రోజూ డ్రిల్ చేస్తుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా ప్రతి రోజూ లా అండ్ ఆర్డర్ లో ఉన్న పోలీసులు డ్రిల్ చేయడం కష్టంగా మారింది. దీంతో పోలీసుల్లో ఊబకాయం పెరిగిపోయింది. అయితే అటువంటి వారు ప్రతి రోజూ క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్న అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా సూర్యనమస్కరాల శిల్పాక్రుతిని ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.

Yoga Pose 2

Yoga Pose 2

ఒక్కో నమస్కారానికి ఒక్కో విగ్రహాన్ని పెట్టి అన్ని కలిపి పక్కపక్కనే వచ్చేలా ఏర్పాటు చేసిన ప్రతిమ ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటివరకూ నగరంలో ఇటువంటి విగ్రహాలు లేవు. మొట్ట మొదటి సారి సులభంగా అర్దం అయ్యేలా సూర్య నమస్కారాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై పలువురు సతీష్ కుమార్ ను అభినందించారు.

అధిక ఒత్తిడి ఎదుర్కోనే శాఖల్లో పోలీస్ శాఖ ముందు వరుసలో ఉంటుంది. దీంతో ఎక్కువ మంది బిపి, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని లైఫ్ స్టైల్ డిసీజ్ ల నుండి దూరంగా ఉండాలంటూ తప్పకుండా సూర్య నమస్కారాలు, యోగా చేయాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. సిబ్బందిలో అవగాహక కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించి సూర్య నమస్కారాలు చేసేందుకు ఈ ప్రతిమను పెట్టామన్నారు. ఒక్క పోలీసులే కాకుండా ఎస్పీ కార్యాలయం ఎదుట నుండి వచ్చే పోయే వారందరికి ఈ ప్రతిమ కనిపిస్తుంది. దీన్ని చూసైనా కొంతమందిలో మార్పు వచ్చి సూర్య నమస్కరాలు చేస్తారన్న భావన ఎస్పీ వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర