Mixer Grinder Vs Blender: ‘మిక్సీ వర్సెస్ బ్లెండర్’ వీటిల్లో ఏది కొనుక్కుంటే ఇంటికి బెటర్?

ప్రతీ కిచెన్‌లో కామన్‌గా ఉండే వస్తువుల్లో మిక్సీ కూడా ఒకటి. మిక్సీ ఉంటే వంట గదిలో సగం పని సులువుగా అయిపోయినట్టు ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు.. పిండులు, పొడులు, జ్యూసులు, పచ్చళ్లు ఇలా అన్నీ చక చకా అయిపోతాయి. కొంత మంది అయితే ఇడ్లీ పిండి వంటి కోసం గ్రైండర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ఎక్కువగా బ్లెండర్స్ అనే పదం వినిపిస్తుంది. చూడటానికి ఇది కూడా మిక్సీలాగానే ఉంటుంది. అయితే తక్కువ ప్లేస్‌ని ఆక్రమిస్తుంది. బ్లెండర్స్ వచ్చాక..

Mixer Grinder Vs Blender: 'మిక్సీ వర్సెస్ బ్లెండర్' వీటిల్లో ఏది కొనుక్కుంటే ఇంటికి బెటర్?
Mixer Grinder Vs Blender
Follow us
Chinni Enni

|

Updated on: Apr 05, 2024 | 6:53 PM

ప్రతీ కిచెన్‌లో కామన్‌గా ఉండే వస్తువుల్లో మిక్సీ కూడా ఒకటి. మిక్సీ ఉంటే వంట గదిలో సగం పని సులువుగా అయిపోయినట్టు ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు.. పిండులు, పొడులు, జ్యూసులు, పచ్చళ్లు ఇలా అన్నీ చక చకా అయిపోతాయి. కొంత మంది అయితే ఇడ్లీ పిండి వంటి కోసం గ్రైండర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య ఎక్కువగా బ్లెండర్స్ అనే పదం వినిపిస్తుంది. చూడటానికి ఇది కూడా మిక్సీలాగానే ఉంటుంది. అయితే తక్కువ ప్లేస్‌ని ఆక్రమిస్తుంది. బ్లెండర్స్ వచ్చాక చాలా మంది కన్ఫూజన్‌కి గురవుతూ ఉంటున్నారు. మిక్సీ లేదా బ్లెండర్స్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారు. మీ కన్ఫూజన్‌కి చెక్ పెట్టేందుకే ఈ కథనం. మరి వీటిల్లో ఏది బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

మిక్సీ:

మిక్సీలు వచ్చాక వంటింట్లో చాలా వరకూ మహిళలకు పని అనేది తగ్గింది. ఇంతకు ముందు పచ్చళ్లు, పొడులు, పిండులు తయారు చేయాలంటే రోట్లలో చేసేవారు. వీటిల్లో చేయడానికి శ్రమ ఎక్కువగా పడుతుంది. అయితే మిక్సీలు వచ్చాక.. ఈ పని చాలా వరకు తగ్గింది. కొన్ని నిమిషాల్లో పొడులు, పిండులు, పచ్చళ్లు సిద్ధం అవుతున్నాయి. అంతే కాకుండా మిక్సీతో పాటు జ్యూస్ జార్ కూడా ఇస్తున్నారు. దీంతో రకరకాల ఫ్రూట్ జ్యూసులు కూడా తయారు చేసుకోవచ్చు.

బ్లెండర్స్:

బ్లెండర్స్‌ను ప్రత్యేకంగా స్మూతీలు, షేక్స్, సూపులు, సాస్‌లు, ప్యూరీలు వంటివి తయారు చేసుకోవడానికి మాత్రమే స్పెషల్‌గా తయారు చేశారు. ఈ బ్లెండర్‌తో పండ్లు, కూరగాయల జ్యూసులు ఎంతోసులువగా అవుతాయి. పొడులు, పచ్చళ్లు, పిండ్లు తయారు చేసుకోవడానికి ఇది అంతగా పని చేయదు.

ఇవి కూడా చదవండి

ఏది బెటర్:

చాలా మంది ఇళ్లల్లో ఎక్కువగా మిక్సీలే ఉంటాయి. మిక్సీలతో ఎన్నో తయారు చేసుకోవచ్చు. బ్లెండర్‌తో బలంగా ఉండే పదార్థాలను పొడిగా మార్చలేము. కేవలం మెత్తగా ఉన్న వాటిని మాత్రమే గుజ్జులా తయారు చేస్తుంది. కాబట్టి మిల్క్ షేక్‌లు, జ్యూసులు, స్మూతీలు వంటివి తయారు చేసుకునేవారికి బ్లెండర్ బెటర్. సాధారణ కిచెన్ పదార్థాలు తయారు చేసుకోవాలంటే మిక్సీనే మంచిది. కాబట్టి ఎవరి అవసరాలను బట్టి వారు.. వీటిని ఉపయోగించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..