Lifestyle: మీకు తెలుసా.? ఇవి కూడా డిప్రెషన్ లక్షణాలే..
ఒక అధ్యయనం ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరగడం కూడా డిప్రెషన్ తాలుకూ లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనుషుల శరీర ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకున్నారు. 2020లో ప్రారంభమైన ఈ అధ్యాయనం సుమారు 7 నెలల పాటు కొనసాగింది...

ఒకప్పుడు అనారోగ్య సమస్య అంటే కేవలం శారీరక సమస్యలుగానే భావించే వాళ్లు. కానీ ఇప్పుడిప్పుడే మానసిక సమస్యను కూడా ఒక అనారోగ్య సమస్యగా భావించే రోజులు వచ్చాయి. ఈ వ్యాధికి సంబంధించి అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. మానసిక సమస్యలకు కూడా వైద్యం ఉంటుందని తెలుసుకుంటున్నారు. అయితే చికిత్సకు ముందు అసలు మనం మానసిక సమస్యలతో బాధపడుతున్నామన్న విషయం ఎలా తెలుసుకోవాలన్నదే ప్రశ్న. కొన్ని రకాల లక్షణాల ఆధారంగా మానసిక సమస్యను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒక అధ్యయనం ప్రకారం శరీర ఉష్ణోగ్రత పెరగడం కూడా డిప్రెషన్ తాలుకూ లక్షణంగా నిపుణులు చెబుతున్నారు. ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనుషుల శరీర ఉష్ణోగ్రతను పరిగణలోకి తీసుకున్నారు. 2020లో ప్రారంభమైన ఈ అధ్యాయనం సుమారు 7 నెలల పాటు కొనసాగింది. ఇందులో తేలిన విషయం ఆధారంగా డిప్రెషన్ ఉన్న వారిలో ఇతరుల కంటే ఎక్కువ శరీర ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు.
డిప్రెషన్ బారిన పడిన వారిలో గుండె దడ పెరగడం, రక్తప్రసరణ వేగంగా జరగడం కారణంగా శరీరంలో సాధారణం కంటే వేడిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక డిప్రెషన్ బారిన పడిన వారు నిత్యం విచారంగా, నిస్సహాయంగా ఉంటారు. చిరాకు, రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం, ఏ పనిపై ఏకాగ్రత ఉండకపోవడం వంటివి కూడా డిప్రెషన్ తాలుకూ లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.
దీర్ఘకాలంగా ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కూడా ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. అయితే చాలా మంది మానసిక ఆరోగ్యంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో లైట్ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




