AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు తాగినప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు.. తిన్నారంటే..

పాలు పోషకమైనవి, కానీ కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం జీర్ణక్రియను దెబ్బతీసి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పుల్లని పండ్లు, చేపలు, ఉప్పు, ఊరగాయలు, ఉల్లిపాయలు వంటివి పాలతో కలిపి తీసుకోకూడదు. ఈ కలయికలు కడుపు ఉబ్బరం, అజీర్ణం, చర్మ సమస్యలు వంటి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. సరైన ఆహార కలయికలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

పాలు తాగినప్పుడు ఇలాంటి ఆహారాలు అస్సలు తినకూడదు.. తిన్నారంటే..
Milk And Food Combinations
Jyothi Gadda
|

Updated on: Dec 03, 2025 | 9:33 PM

Share

పాలు మన రోజువారీ ఆహారంలో అత్యంత పోషకమైన భాగాలలో ఒకటిగా చెబుతారు. పాలు శరీరానికి కావాల్సిన బలాన్ని అందిస్తాయి. శరీర పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కానీ పాలను కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం…

చాలా మందికి పాలు అన్ని రకాల ఆహారాలతో తీసుకోకూడదని తెలియదు. అలాంటప్పుడు పాలను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవటం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. పాలతో కలిపి ఎప్పుడూ తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ కాంబినేషన్ శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

పాలు నారింజ, నిమ్మ, జామ, ఇతర పుల్లని పండ్లు పాలతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ తీసుకుంటే అవి కడుపులో పాలు గడ్డ కట్టేలా చేస్తాయి. దీని వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. చర్మంపై మచ్చలు, అలర్జీలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. పాలు, ఉప్పు కలిగిన ఆహారాల కలయిక జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. శరీర జీవక్రియ ప్రక్రియను బలహీనపరుస్తుంది. ఇది భారంగా, అసౌకర్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పాలతో ఊరగాయ తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఎందుకంటే పులియబెట్టడం, మసాలా దినుసులు పాలు చల్లదనాన్ని దెబ్బతీస్తాయి. పాలతో ఉల్లిపాయలను తీసుకోవడం హానికరం అని చెబుతారు. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని, విషాలను పెంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతకు దారితీస్తుంది. పాలు, ముల్లంగిని కలిపి తీసుకోవడం వల్ల చర్మ అలర్జీలు, దురద లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాటి వ్యతిరేక లక్షణాలు శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..