శీతాకాలంలో ఇంటిని సహజంగా వెచ్చగా ఉంచే 6 అద్భుత మొక్కలు.. నాసా కూడా ఒప్పుకుంది!
చలికాలం వచ్చిందంటే ఇల్లు ఐస్‌బాక్స్‌లా మారిపోతుంది, హీటర్ ఆన్ చేస్తే కరెంటు బిల్లు భయపెడుతుంది, ఆఫ్ చేస్తే చలి తట్టుకోలేరు. కానీ ఒక్క సీక్రెట్ తెలిస్తే.. మీ ఇంట్లోనే కొన్ని మొక్కలు సహజ హ్యూమిడిఫైయర్‌లుగా పనిచేసి, గది ఉష్ణోగ్రతను 3–4 డిగ్రీల వరకు పెంచుతాయని ..

చలికాలం వచ్చిందంటే ఇల్లు ఐస్‌బాక్స్‌లా మారిపోతుంది, హీటర్ ఆన్ చేస్తే కరెంటు బిల్లు భయపెడుతుంది, ఆఫ్ చేస్తే చలి తట్టుకోలేరు. కానీ ఒక్క సీక్రెట్ తెలిస్తే.. మీ ఇంట్లోనే కొన్ని మొక్కలు సహజ హ్యూమిడిఫైయర్‌లుగా పనిచేసి, గది ఉష్ణోగ్రతను 3–4 డిగ్రీల వరకు పెంచుతాయని నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ మొక్కలు రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసి, గాలిలో తేమను పెంచి, హానికర వాయువులను పీల్చేస్తాయి. ఫలితంగా హీటర్ ఖర్చు తగ్గుతుంది, ఇల్లు వెచ్చగా, శుభ్రంగా మారుతుంది. చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచుతూ ఆక్సీజన్‌ను పెంచే ఆ మొక్కలేంటో తెలుసుకుందాం..
1. స్నేక్ ప్లాంట్
– రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసే అరుదైన మొక్క. – గాలిలోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్ వంటి హానికర వాయువులను తొలగిస్తుంది. – చల్లటి వాతావరణంలో తేమను ఎక్కువసేపు పట్టి ఉంచి గదిని వెచ్చగా ఉంచుతుంది. – తక్కువ నీళ్లు, తక్కువ కాంతి అవసరమయ్యే ఈ మొక్కలు బిగినర్స్‌కి బెస్ట్ ఛాయిస్!
2. మనీ ప్లాంట్
– తేమను ఆకర్షించి గదిలో హ్యూమిడిటీని పెంచుతుంది. - శీతాకాలంలో ఎండిపోయే గాలిని నివారిస్తుంది. – కార్బన్ డై ఆక్సైడ్‌ను ఎక్కువగా తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. – హ్యాంగింగ్ బాస్కెట్‌లో పెట్టి విండో సైడ్ ఉంచితే గది టెంపరేచర్ సహజంగా పెరుగుతుంది.
౩. పీస్ లిలీ
– నాసా స్టడీలో నం.1 ర్యాంక్ పొందిన ఎయిర్ ప్యూరిఫైయర్. – గాలిలో తేమను గణనీయంగా పెంచి శుష్కత్వాన్ని తగ్గిస్తుంది. – గది వెచ్చదనం పెరుగుతుంది. – రాత్రిళ్లు కూడా ఆక్సిజన్ ఇస్తుంది. – బెడ్‌రూమ్‌లో పెట్టుకునేందుకు బెస్ట్ ఛాయిస్.
4. అరెకా పామ్
– రోజుకు 1 లీటరు నీటిని ఆవిరిగా విడుదల చేసి గాలిని తేమతో నింపుతుంది. – శీతాకాలంలో ఇంటర్నల్ హ్యూమిడిఫైయర్‌లా పనిచేస్తుంది. – హీటర్ ఖర్చు తగ్గుతుంది.
5. బోస్టన్ ఫెర్న్
– గాలిలోని తేమను 50-60 శాతం వరకు పెంచే సూపర్ హ్యూమిడిఫైయర్ మొక్క. – ఎయిర్‌లోని టాక్సిన్స్, డస్ట్ పార్టికల్స్‌ను ఫిల్టర్ చేస్తుంది.
6. రబ్బర్ ప్లాంట్
– పెద్ద ఆకుల వల్ల ఎక్కువ తేమ ఆవిరై గది వెచ్చదనాన్ని పెంచుతుంది. – రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
జాగ్రత్తలు
– మొక్కల కుండీల కింద నీళ్లతో నిండిన ట్రే పెట్టాలి. – ఆవిరై హ్యూమిడిటీ పెరుగుతుంది. – విండో సైడ్ లేదా బాల్కనీలో పెట్టి సూర్యరశ్మి పడేలా చూడాలి. – వారానికి ఒకసారి ఆకుల మీద స్ప్రే చేయాలి. – తేమ ఎక్కువ అవుతుంది. – రాత్రిళ్లు బెడ్‌రూమ్‌లో స్నేక్ ప్లాంట్, పీస్ లిలీ పెట్టాలి. – నిద్రలో ఆక్సిజన్ సప్లై చేస్తాయి.
ఈ ఆరు మొక్కలతో మీ ఇల్లు శీతాకాలంలో సహజ హ్యూమిడిఫైయర్‌గా మారిపోతుంది. హీటర్ బిల్ తగ్గడమే కాదు… శుభ్రమైన గాలి, మంచి నిద్ర, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం కూడా మీ సొంతం అవుతుంది!




