AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Menopause Myths: పోస్ట్ మెనోపాజ్ అంటే ఏమిటి? ఈ దశలో మహిళల్లో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..!

మెనోపాజ్‌లో మూడు దశలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మొదటి దశ పెరిమెనోపాజ్. ఇది మెనోపాజ్‌కు 10 సంవత్సరాల ముందు ప్రారంభమవుతుంది. ఈ దశలో స్త్రీ శరీరంలో హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా 40 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. రెండవ దశను మెనోపాజ్ అంటారు. ఇందులో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి.

Menopause Myths: పోస్ట్ మెనోపాజ్ అంటే ఏమిటి? ఈ దశలో మహిళల్లో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..!
Menopause Myths
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2024 | 11:34 AM

మెనోపాజ్ అనేది స్త్రీలలో సంభవించే సహజ ప్రక్రియ. రుతుక్రమం ఆగిపోతే మెనోపాజ్ అని అంటారు. అంటే 10 నుంచి 12 నెలల వరకు పీరియడ్స్ రానప్పుడు ఆ ప్రక్రియను మెనోపాజ్ అంటారు. సాధారణంగా మెనోపాజ్ 50 ఏళ్ల తర్వాత వస్తుంది. ఈ కాలంలో అండాశయాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. హార్మోన్ల స్థాయిలు గణనీయంగా తగ్గడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. మెనోపాజ్ తర్వాత గర్భం కూడా కష్టమవుతుంది. అయితే మహిళలు మెనోపాజ్ తర్వాత జీవితంలో అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మెనోపాజ్ తర్వాత కాలాన్ని వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజ్ అంటారు.

మెనోపాజ్‌లో మూడు దశలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మొదటి దశ పెరిమెనోపాజ్. ఇది మెనోపాజ్‌కు 10 సంవత్సరాల ముందు ప్రారంభమవుతుంది. ఈ దశలో స్త్రీ శరీరంలో హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా 40 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. రెండవ దశను మెనోపాజ్ అంటారు. ఇందులో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఈ దశలో అండాశయాలలో ఎగ్స్ ఉండవు. సాధారణ మార్గాల ద్వారా గర్భం దాల్చలేరు. మూడవ, చివరి దశ పోస్ట్ మెనోపాజ్.. ఇది మెనోపాజ్ తర్వాత సమయం.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడమే దీనికి కారణం. ఈ హార్మోన్ల లోపం అనేక ఇతర వ్యాధులకు కూడా కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు ఏమిటి?

శరీరం వేడిగా ఉన్న ఫీలింగ్.. దీనిని హాట్ ఫ్లాషెస్ అని పిలుస్తారు

నిద్ర పట్టదు

చిరాకు, నిరాశ, మానసిక కల్లోలం వంటి భావోద్వేగ మార్పులు

పోస్ట్ మెనోపాజ్ లక్షణాలలో డిప్రెషన్ కూడా ఒకటి

మెనోపాజ్ గురించి 4 సాధారణ అపోహలున్నాయి. మెనోపాజ్ కొండతమంది చాలా ఆలస్యంగా మొదలవుతుందా? అంటే ఇది నిజం కాదు. రుతువిరతి సాధారణంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. అయితే ఇది స్త్రీ నుండి స్త్రీకి మారవచ్చు.

మెనోపాజ్ దశ ఎంత సమయం ఉంటుందంటే?

రుతువిరతి తక్షణం ముగియదు. దీని లక్షణాలు చాలా సంవత్సరాలు కొనసాగుతాయి, ముఖ్యంగా పెరిమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ సమయంలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కనిపిస్తాయి.

మెనోపాజ్ సమయంలో వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు పడతాయా..?

ప్రతి స్త్రీలో ఈ లక్షణాలు ఉండవు. మెనోపాజ్ అనుభవాలు ఒక్కొక్కరిపై ఒకొక్కలా ఆధారపడి ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)