ఒకొక్కసారి అకస్మాత్తుగా కనుల ముందు చీకటిగా మారి తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఇలా జరగినప్పుడు నీరసంగా ఉందనో.. లేక షుగర్ లెవెల్ పెరగడమో లేదా తగ్గమో జరిగింది భావిస్తారు. అయితే ఇలా అకస్మాత్తుగా తల తిరగడం, కనులు ముందు చీకటిగా మారడానికి కారణం.. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ కొన్ని సెకన్లపాటు తగ్గిపోయినప్పుడు బ్లాక్ అవుట్ లేదా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. న్యూరోలాజికల్ సమస్య ఉంటే ఇలా జరగవచ్చు.