ఇవ్వే మీ కొంప ముంచేవి.. మీరు తినే ఈ 5 పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను ఫుల్లుగా పెంచుతాయంట..

కొలెస్ట్రాల్.. మనిషి ప్రాణాలను తీస్తోంది.. ఊబకాయంతో అన్ని రకాల అనారోగ్య కారణాలకు అంటే.. ఇదే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే కొవ్వు... ఇది మీ శరీరానికి చాలా అవసరం.. కానీ చాలా కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవ్వే మీ కొంప ముంచేవి.. మీరు తినే ఈ 5 పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ను ఫుల్లుగా పెంచుతాయంట..
Cholesterol
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2024 | 10:48 AM

కొలెస్ట్రాల్.. మనిషి ప్రాణాలను తీస్తోంది.. ఊబకాయంతో అన్ని రకాల అనారోగ్య కారణాలకు అంటే.. ఇదే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే కొవ్వు… ఇది మీ శరీరానికి చాలా అవసరం.. కానీ చాలా కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉన్నాయి.. ఒకటి మంచి కొలెస్ట్రాల్ (HDL).. రెండోది చెడు కొలెస్ట్రాల్ (LDL).. మంచిది హాని కలిగించదు.. కానీ.. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండెపోటు.. స్ట్రోక్ ప్రమాదం వస్తుంది. అటువంటి పరిస్థితిలో నివారణ కోసం మీ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం.. దీని కోసం, మీరు మీ ఆహారంలో ఏమి తింటారు అనే దానిపై శ్రద్ధ వహించాలి.. ఎందుకంటే కొన్ని ఆహారాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను చాలా వేగంగా పెంచడానికి కారణమవుతాయి.

ఆరోగ్యం గురించి ఆలోచించినప్పటికీ.. హాని కలిగించే ఆహారాలను చాలామంది తెలియకుండానే ప్రతిరోజూ తీసుకుంటున్నారు. అందుకే.. ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదంట.. అవేంటో తెలుసుకోండి..

చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే 5 ఆహారాలు ఏంటో తెలుసుకోండి..

ప్రాసెస్డ్ ఫుడ్స్: ట్రాన్స్ ఫ్యాట్ LDL కొలెస్ట్రాల్‌ను పెంచడంతో పాటు, ఈ సింథటిక్ కొవ్వులు ‘మంచి’ HDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తాయి. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాల్చిన వస్తువులలో అధిక మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది.

పాల ఉత్పత్తులు: ప్రధానంగా జంతు ఉత్పత్తులు, కొన్ని మొక్కల నూనెలలో లభించే సంతృప్త కొవ్వులు LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. ఇందులో ప్రధానంగా రెడ్ మీట్, పూర్తి క్రీమ్ పాల ఉత్పత్తులు, అత్యధిక కొలెస్ట్రాల్ కలిగిన నూనెలు ఉన్నాయి.

గుడ్డు పచ్చసొన: ప్రోటీన్, గుడ్డు వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. కానీ మీరు ప్రతిరోజూ 2 గుడ్డు సొనలు ఎక్కువగా తింటుంటే అది మీ శరీరంలో LDL కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

శుద్ధి చేసిన వంట నూనె: శుద్ధి చేసిన వంట నూనె కూడా కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, సంతృప్త, ట్రాన్స్ కొవ్వులతో నిండిన నూనెలను నివారించండి.. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి ఆలివ్ నూనె, అవకాడో నూనె వంటి వాటిని ఉపయోగించండి..

ప్రాసెస్ చేసిన చక్కెర: చక్కెర, ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను పెంచడమే కాకుండా, వాపును కూడా పెంచుతాయి, తద్వారా గుండె జబ్బులకు ప్రమాద కారకాలు పెరుగుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ