Coconut Oil: స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరకట్లేదా?.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండిలా!
How To Make Instant Coconut Oil At Home : కొబ్బరి నూనె జుట్టుకి, చర్మానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. మార్కెట్లో దొరికే నూనెలలో కల్తీలు ఉండే అవకాశం ఉంది, కానీ ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. ముఖ్యంగా పండగలు, పూజల తర్వాత మిగిలిపోయిన ఎండు కొబ్బరి ముక్కలతోనే ఈ నూనెను సులభంగా తయారు చేయవచ్చు. అదెలానో తెలుసుకోండి.

ఏవైనా పండుగలు లేదా పూజల సమయంలో మనం ఇంట్లో కొబ్బరి కాయలను కొడుతూ ఉంటాం. తర్వాత అవి మిలిగిపోతాయి. కొందరు వాటిని వేస్ట్‌గా చెత్తలో పడేస్తుంటారు. కానీ ఈ కొబ్బరికాయల నుండి మీరు ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తయారు చేయవచ్చని మీకు తెలుసా? అవును కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి మనం ఇంట్లోనే కొబ్బరి నూనెను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా, ఎండు కొబ్బరికాయలను పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని.. నీటితో కగిడి సుమారు 2 గంటల పాటు నానబెట్టి తర్వాత వాటి నుంచి పాలు తీయండి. ఆ పాల నుంచి నూనె ఈజీగా తయారు చేసుకోచ్చు.
ఇంట్లోనే కొబ్బరి నూనెను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కాయల నుంచి కొబ్బరి తీయడం: ముందుగా మీ ఇంట్లో మిగిలిపోయిన కొబ్బరి కాయల నుంచి ఎండు కొబ్బరిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలో వేసి, నీళ్లు పోసి సుమారు 2 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి మెత్తబడి, పాలు తీయడం సులభమవుతుంది.
కొబ్బరి పాలు తీసే విధానం: నానిన కొబ్బరి ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.ఇప్పుడు ఒక పల్చటి కాటన్ గుడ్డను తీసుకుని, అందులో ఈ పేస్ట్‌ను వేసి గట్టిగా పిండాలి. అప్పుడు చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి. పాలు తీయగా మిగిలిన కొబ్బరి పొట్టును పారేయకుండా, ఎండబెట్టి కూరల్లోకి లేదా స్వీట్లలోకి వాడుకోవచ్చు.
మీగడను వేరు చేయడం: వచ్చిన కొబ్బరి పాలను ఒక గిన్నెలో పోసి, మూత పెట్టి 12 నుండి 15 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లదనం వల్ల పైన గట్టి తెల్లటి మీగడ పేరుకుపోతుంది, నీళ్లన్నీ కిందకు వెళ్తాయి. మరుసటి రోజు, పైన పేరుకున్న ఆ గట్టి పొరను జాగ్రత్తగా స్పూన్‌తో తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి.
నూనెను మరిగించడం: ఈ చిక్కటి మీగడను మందపాటి కడాయిలో వేసి మీడియం ప్లేమ్‌లో వేడి చేయాలి. వేడి తగిలే కొద్దీ ఆ మీగడ కరిగి నూనెలా మారుతుంది. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. సుమారు 45 నుండి 60 నిమిషాల తర్వాత, తెల్లటి పదార్థం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారి అడుగున ఉండిపోతుంది, పైన స్వచ్ఛమైన కొబ్బరి నూనె తేలుతుంది. పూర్తిగా విడిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి, కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ నూనెను వడకట్టి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
ఇది 100% స్వచ్ఛమైనది, ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి, నూనెలో తడి చెంచా వేయకుండా చూసుకోవాలి. అప్పుడే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ పద్ధతిలో తయారు చేసిన నూనెను మీరు వంటలకు, చర్మానికి లేదా జుట్టుకు సందేహం లేకుండా వాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
