AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బజాజ్ చేతక్ Vs ఏథర్ రిజ్టా.. ఈ రెండిటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్..? కొనేముందు ఇవి తెలుసుకోండి..

Bajaj Chetak 3001 vs Ather Rizta S: భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవాలనుకునే సామాన్యుడికి ఇప్పుడు మార్కెట్లో రెండు ఆసక్తికరమైన ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి.. దశాబ్దాల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన బజాజ్ చేతక్ 3001, రెండు.. అత్యాధునిక ఫీచర్లతో ఫ్యామిలీ స్కూటర్‌గా దూసుకొచ్చిన ఏథర్ రిజ్టా ఎస్. ఈ రెండింటిలో ఏది బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

బజాజ్ చేతక్ Vs ఏథర్ రిజ్టా.. ఈ రెండిటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటీ బెస్ట్..? కొనేముందు ఇవి తెలుసుకోండి..
Bajaj Chetak 3001 Vs Ather Rizta S
Krishna S
|

Updated on: Mar 29, 2026 | 3:17 PM

Share

భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించేందుకు దిగ్గజ సంస్థలు బజాజ్, ఏథర్ తలపడుతున్నాయి. బజాజ్ నుంచి వచ్చిన ఐకానిక్ చేతక్ 3001, ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌గా పేరు తెచ్చుకున్న రిజ్టా ఎస్ మధ్య ఇప్పుడు గట్టి పోటీ నెలకొంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనం కొనేటప్పుడు వినియోగదారులు ముందుగా చూసేది ధర. బజాజ్ చేతక్ 3001 ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.07 లక్షలు. ఏథర్ రిజ్టా ఎస్ ధర సుమారు రూ.1.15 లక్షలు. ధర పరంగా చూస్తే చేతక్ సుమారు రూ.8,000 తక్కువకే లభిస్తోంది. బడ్జెట్ ముఖ్యం అనుకునే వారికి చేతక్ మొదటి ఛాయిస్ అవుతుంది.

డిజైన్ – కంఫర్ట్

బజాజ్ చేతక్ ఇది ఒక వింటేజ్, ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. మెటల్ బాడీతో వచ్చే ఈ స్కూటర్ క్లాసిక్ స్టైల్ ఇష్టపడే కుటుంబాలకు బాగా నచ్చుతుంది. ఏథర్ రిజ్టా పూర్తి ఆధునిక, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీని సీటు. సెగ్మెంట్‌లోనే అతిపెద్ద వెడల్పాటి సీటును రిజ్టా కలిగి ఉంది. అయితే తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు దీని వెడల్పు వల్ల కొంచెం ఇబ్బంది కలగవచ్చు.

ఫీచర్ల స్మార్ట్‌నెస్

టెక్నాలజీ విషయంలో ఏథర్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. రిజ్టా ఎస్‌లో హిల్ హోల్డ్, ఫాల్‌సేఫ్ అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ టెక్నాలజీ ఉన్నాయి. చేతక్ 3001 లో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. కానీ కొన్ని స్మార్ట్ ఫీచర్లను పొందాలంటే మీరు అదనంగా టెక్‌ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది.

స్పీడ్ ఎవరిది?

రేంజ్ విషయంలో రెండు స్కూటర్లు దాదాపు 120 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి. కానీ వేగం దగ్గరే అసలైన తేడా ఉంది: చేతక్ 3001 గరిష్ట వేగం గంటకు 63 కి.మీ. మాత్రమే. ఇది సిటీ లోపల ప్రయాణాలకు సరిపోతుంది. రిజ్టా ఎస్ గంటకు 80 కి.మీ. గరిష్ట వేగంతో వెళ్తుంది. మీరు హైవేలపై లేదా కొంచెం వేగంగా వెళ్లాలనుకుంటే రిజ్టా బెస్ట్ ఆప్షన్.

ఏది కొనాలి?

మీరు ఒక నమ్మకమైన, గట్టి మెటల్ బాడీ ఉన్న, తక్కువ ధరలో దొరికే ఫ్యామిలీ స్కూటర్ కోసం చూస్తుంటే బజాజ్ చేతక్ 3001 తీసుకోండి. ఒకవేళ మీకు లేటెస్ట్ ఫీచర్లు, ఎక్కువ వేగం, భారీ స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే ఏథర్ రిజ్టా ఎస్ సరైన ఎంపిక.

Follow Us