వేసవి కాలంలోనూ మనకు పలు రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటిల్లో మామిడి పండ్లు చాలా ముఖ్యమైనవి. వీటి అద్భుత వాసనకే నోరూరుతుంది
TV9 Telugu
జూలై నెల వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. కొందరికి కోత మామిడి పండ్లు ఇష్టమైతే.. మరికొందరికి పచ్చి మామిడి అంటే మహా ఇష్టం
TV9 Telugu
ఆలా భిన్న రకాల రుచులను కలిగి ఉంటారు. వేసవి పండ్లలో నీరు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కర్బూజా నుంచి లీచీ, పుచ్చకాయ వరకు ప్రతి పండు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పండ్ల రాజు అయిన మామిడికి మాత్రం ప్రత్యేక గుర్తింపు ఉంది
TV9 Telugu
పచ్చి మామిడికాయలు ఏప్రిల్ నెలలో మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. పచ్చి మామిడికాయను చూడగానే నోరు ఊరుతుంది. దాని అద్భుత రుచితోపాటు వీటిల్లో అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
USDA ప్రకారం ఒక కప్పు పచ్చి మామిడిలో 60.1 మిల్లీగ్రాముల విటమిన్ సి, 1.1 మిల్లీగ్రాముల నియాసిన్, 71 మైక్రోగ్రాముల ఫోలేట్, 89.1 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, 1.48 మైక్రోగ్రాముల విటమిన్ ఇ, 6.93 మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటాయి
TV9 Telugu
వీటితోపాటు ఐరన్, సెలీనియం, మాంగనీస్, రాగి, జింక్ కూడా ఉంటాయి. పచ్చి మామిడిలో అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు సైతం మితంగా ఉంటాయి. వాటిలో బీటా-కెరోటిన్, లైకోపీన్, ల్యూటిన్, జీక్సాంథిన్ వంటి పోషకాలు ఉంటాయి
TV9 Telugu
పచ్చి మామిడికాయలు వడదెబ్బ నుండి కాపాడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతేకాకుండా ఇవి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి
TV9 Telugu
మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు