AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరికీ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్.. అమల్లోకి వచ్చేసింది..

తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. తొలి ముద్ద పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త స్కీమ్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. శనివారం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకంతో పిల్లలకు లబ్ది చేకూరనుంది. వాటి వివరాలేంటో తెలుసుకుందాం.

Telangana: తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరికీ ఉచితంగా బ్రేక్ ఫాస్ట్.. అమల్లోకి వచ్చేసింది..
Telangana Government
Venkatrao Lella
|

Updated on: Mar 29, 2026 | 3:40 PM

Share

తెలంగాణ ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాల ప్రారంభంపై స్పీడ్ పెంచింది. తాజాగా మరో కొత్త పథకాన్ని లాంచ్ చేసింది. తొలి ముద్ద పేరుతో చిన్నారులకు పౌషకాహారం అందించేందుకు కొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చిన్నారులకు రోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. పిల్లలకు పోషకాహారం అందించేందుకు, పోషకాహారలేమితో బాధపడకుండా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెచ్చిన ఈ పథకం వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.

తొలిముద్దం పథకం ఏంటి..?

పిల్లలకు పోషకాహారం అందించేందుకు తొలిముద్ద పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని రేవంత్ ప్రారంభించారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద అంగన్‌వాడీల్లో పిల్లలకు ఉప్మా, కిచిడీ అందిస్తారు. మిక్స్ బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని సమర్దవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలదేనని, వారిపై ఈ బాధ్యత ఉందని రేవంత్ తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఉచిత మొబైల్ ఫోన్లను కూడా పంపిణీ చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తేనే వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని, అందుకే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. సరైన ఆహారం పిల్లలకు అందకపోవడం వల్లనే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. తొలిముద్దం పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు.

సొంత భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు

ఇక సొంత భవనాల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు నిర్మించేలా ప్రణాళికలు రచించాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలను సొంత కుటుంబసభ్యుల్లా భావించాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేవారిని కన్నబిడ్డల్లా చూసుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యర్తలను తమ ప్రభుత్వం సొంత కుటుంబసభ్యుల్లా భావిస్తోందని తెలిపారు.

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండిపై ఎంతంటే
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
హైవేలపై ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఒక్క స్కాన్‌తో
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
టెన్త్ అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ 45 రోజులు రావాలా? సింపుల్ టిప్స్
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్