PBKS vs MI: ముంబైకు మరో బిగ్ షాక్.. పంజాబ్‌తో మ్యాచ్‌కు ‘స్కై’ దూరం..! కొత్త కెప్టెన్‌గా ఎవరంటే?
Suryakumar Yadav Injury Update: ఐపీఎల్ 2026 సీజన్‌లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు స్టార్ బ్యాటర్, తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యాడు. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో, ఇప్పుడు సూర్య కూడా తప్పుకోవడం ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి కోలుకోలేని దెబ్బగా మారింది.

Suryakumar Yadav Injury Update: మే 15న ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు ఇప్పటికే ధర్మశాల చేరుకున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ జట్టుతో ప్రయాణించలేదు. వీరు తర్వాత జట్టుతో కలుస్తారని భావించినప్పటికీ, తాజా నివేదికల ప్రకారం వీరిద్దరూ ప్రస్తుతం ముంబైలోనే ఉన్నారు. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై తన ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తోంది.
కొత్త సారథి ఎవరు?
హార్దిక్, సూర్య ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ రేసులో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, యువ ఆటగాడు తిలక్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ జట్టును ఎదుర్కోవడానికి అనుభవజ్ఞుడైన బుమ్రా వైపు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మకు అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.
కష్టాల్లో ముంబై ప్లేఆఫ్ ఆశలు..
వరుస ఓటములు, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ ముంబై ప్లేఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేస్తోంది. జట్టులోని సమన్వయం లోపించడం, ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ధర్మశాల వంటి వేగవంతమైన పిచ్‌లపై అనుభవం ఉన్న ఆటగాళ్లు లేకపోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
వరుసగా ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించి ముంబై ఇండియన్స్ మళ్ళీ విజయాల బాట పడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త కెప్టెన్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్‌ను ముంబై ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
